Asian Games 2026: ఆసియా క్రీడల్లో పసిడి మోత మోగించిన నీరూ దండా.. వ్యక్తిగత విభాగంలో దేశానికి తొలి స్వర్ణం!
Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత షూటర్ నీరూ దండా చరిత్ర సృష్టించారు. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించి దేశం గర్వపడేలా చేశారు.
Asian Games 2026: ఆసియా క్రీడల్లో పసిడి మోత మోగించిన నీరూ దండా.. వ్యక్తిగత విభాగంలో దేశానికి తొలి స్వర్ణం!
Asian Games 2026: ఆసియా క్రీడల్లో పదో రోజు భారత షూటర్లు అద్భుత ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించారు. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరూ దండా అగ్రస్థానంలో నిలిచి దేశానికి ఐదో బంగారు పతకాన్ని అందించారు. ఈ సీజన్‌లో వ్యక్తిగత విభాగంలో భారత్‌కు దక్కిన తొలి స్వర్ణం ఇదే కావడం విశేషం.
పతకాల పట్టికలో మెరుగుదల: నీరూ దండా సాధించిన ఈ పసిడి పతకంతో భారత్ పతకాల పట్టికలో ఒక స్థానం మెరుగుపరుచుకుని, మొత్తం 5 బంగారు, 21 రజత, 21 కాంస్య పతకాలతో 11వ స్థానంలో నిలిచింది.
గత పతకాల జోరు: ఇప్పటికే మహిళల ట్రాప్ షూటింగ్ టీమ్ ఈవెంట్‌లో నీరూ దండాతో పాటు ఆషిమా అహ్లావత్, మనీషా కీర్ బృందం రజత పతకం సాధించిన విషయం తెలిసిందే.
ఇతర స్వర్ణ విజయాలు: ఈ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ సేన తొలి స్వర్ణం సాధించగా.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్సడ్ టీమ్ ఈవెంట్‌లో సురుచి సింగ్, కమల్‌జీత్ జోడి పసిడి కైవసం చేసుకుంది. అలాగే కబడ్డీలో పురుషుల, మహిళల జట్లు కూడా స్వర్ణ పతకాలు సాధించి సత్తా చాటాయి.




