Axar Patel: ఏం జరిగిందో అర్థం కావడం లేదు.. ఢిల్లీ దారుణ ఓటమిపై అక్షర్ పటేల్ సంచలన వ్యాఖ్యలు!

Axar Patel opens up DC Defeat vs RCB.రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ దారుణ ఓటమిపై కెప్టెన్ అక్షర్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Rishvik
Published on: 28 April 2026 1:14 PM IST
Axar Patel
X

Axar Patel

Axar Patel: రెండు రోజుల క్రితం పంజాబ్‌ కింగ్స్‌పై చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై చేతులెత్తేశారు. ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ దారుణ ఓటమిని ఎదుర్కొంది. ముందుగా ఢిల్లీ 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్‌ పోరెల్‌ (30) టాప్ స్కోరర్. హేజిల్‌వుడ్‌ (4/12), భువనేశ్వర్‌ (3/5) ధాటికి ఢిల్లీ విలవిల్లాడింది. లక్ష్యాన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. దేవదత్ పడిక్కల్‌ (34 నాటౌట్‌), విరాట్‌ కోహ్లీ (23 నాటౌట్‌) రాణించారు. మ్యాచ్ అనంతరం ఢిల్లీ దారుణ ఓటమిపై కెప్టెన్ అక్షర్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఏం జరిగిందో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని, కానీ క్రికెట్‌లో ప్రతి రోజూ అప్రమత్తంగా ఉండాలని అక్షర్ పటేల్ అన్నాడు. 'ఏం జరిగిందో ఇప్పటికీ నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. కానీ క్రికెట్‌లో ప్రతి రోజూ అప్రమత్తంగా ఉండాలి. సరిగ్గా ఆడాలని అందరూ చెబుతారు. ఈ మ్యాచ్‌ ఫలితంను మర్చిపోయి తదుపరి మ్యాచ్‌కు సిద్ధం కావాలి' అని అక్షర్ చెప్పాడు. గత మ్యాచ్‌లో అదృష్టం మావైపు లేదు అనుకోవచ్చు. అలాంటి ఆలోచనలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. ఆ క్యాచ్ పట్టి ఉంటే లేదా ఆ రన్ పూర్తి చేసి ఉంటే మోమెంటమ్ అలాగే కొనసాగేదేమో అనిపించొచ్చు. కానీ ఇవన్నీ ఆటలో జరుగుతూనే ఉంటాయి. టీ20 క్రికెట్‌లో ప్రతి రోజూ అప్రమత్తంగా ఉండాల్సిందే' అని అక్షర్ తెలిపాడు.

'ఓటములను మరిచి మనం ముందుకు వెళ్లాలి. నెగటివ్‌గా ఉంటే మ్యాచ్‌లు కోల్పోతాం. పాజిటివ్‌గా ఉంటే మంచి ప్రదర్శన ఇస్తాం. కాబట్టి ఈ మ్యాచ్‌ను మర్చిపోయి ముందుకు సాగాలి. నేను జట్టుకు కూడా ఇదే చెబుతాను. ఒక మ్యాచ్ ఒడామని ఎవరిపైనా నింద వేయడం లేదా బ్యాటర్లను తప్పుపట్టడం సరైంది కాదు. గత 6-7 మ్యాచ్‌లలో ఎలా ఆడామో అదే విధంగా ఆడుతాం. సరైన మైండ్‌సెట్‌తో ముందుకు వెళ్లాలి. మొదట్లో బంతి ఎక్కువగా స్వింగ్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. వాళ్లు వరల్డ్ క్లాస్ బౌలర్లు, ఏ గ్రౌండ్‌లోనైనా బంతిని స్వింగ్ చేయగలరు. ఈరోజు ఇంకా బాగా ఆడారు. మా ఓపెనర్లు, టాప్ ఆర్డర్ బ్యాటర్లలో ఎవరో ఒకరు మొదటి కొన్ని ఓవర్లను బాగా ఎదుర్కొని ఉంటే మ్యాచ్ ఫలితం వేరుగా ఉండేదేమో అనిపిస్తుంది. ఒకటి మాత్రం చెప్పాలి. బెంగళూరు పేసర్లు బాగా బౌలింగ్ చేశారు' అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story