Babar Azam: ఒక్క సెంచరీ.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన బాబర్ ఆజమ్!
Babar Azam: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి తన బ్యాటింగ్ క్లాస్‌ను ప్రపంచానికి చూపించాడు.
Babar Azam: ఒక్క సెంచరీ.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన బాబర్ ఆజమ్!
Babar Azam: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి తన బ్యాటింగ్ క్లాస్‌ను ప్రపంచానికి చూపించాడు. మంగళవారం ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో బాబర్ అద్భుత సెంచరీతో చెలరేగి.. తన జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన పెషావర్ 20 ఓవర్లలో 221/7 భారీ స్కోరు చేసింది. బాబర్ 59 బంతుల్లో 103 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారీ లక్ష్య ఛేదనలో ఇస్లామాబాద్ 151 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో పెషావర్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో బాబర్ టీమ్ పీఎస్ఎల్ 2026 ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఈ మ్యాచ్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు ప్రత్యేకంగా నిలిచింది. టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా అతడికి ఇది తొమ్మిదో సెంచరీ. దీంతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (8 సెంచరీలు) రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో భారత స్టార్ విరాట్ కోహ్లీ ఐదు సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఒకే దేశంలో అత్యధిక టీ20 సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన బాబర్ చేరాడు. కోహ్లీ, అభిషేక్ భారత్‌లో 8 సెంచరీలు చేయగా.. బాబర్ పాకిస్థాన్‌లో 8 సెంచరీలు బాదాడు. ఈ ప్రదర్శనతో బాబర్ మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు. ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే.. పెషావర్ జల్మీ టైటిల్ గెలిచే అవకాశాలు ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు.
పీఎస్ఎల్ చరిత్రలో బాబర్ ఆజమ్ తన ముద్ర వేసాడు. ఈ సెంచరీతో అతడు టోర్నీలో నాలుగో శతకం నమోదు చేసి.. ఉస్మాన్ ఖాన్ రికార్డును సమం చేశాడు. పీఎస్ఎల్ 2026 సీజన్‌లో బాబర్ ఇప్పటికే 588 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం బాబర్ మాట్లాడుతూ..
'ఇప్పుడు నా బెస్ట్ ఫామ్‌కి తిరిగి వస్తున్నానని అనిపిస్తోంది. నిలకడగా ఆడాలని, నా స్కిల్స్‌పై నమ్మకం ఉంచుతూ ముందుకు వెళుతున్నా. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటం, ఎప్పుడు బౌలర్లపై దాడి చేయాలో తెలుసుకోవడం ఆటలో ముఖ్యం. పీఎస్ఎల్ ముందు పడిన కష్టంకు ఇప్పుడు ఫలితం వస్తోంది. నాకు చాలా సంతోషంగా ఉంది, ఫైనల్లో గెలిచి కప్ కొడుతాం' అని బాబర్ ధీమా వ్యక్తం చేశాడు.




