Babar Azam: టీ20 చరిత్రలో బాబర్ సరికొత్త చరిత్ర.. ఆ ఘనత సాధించిన అతికొద్ది మందిలో ఒకరిగా
Babar Azam: పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్ మరో అరుదైన ఘనత సాధించాడు.
Babar Azam: టీ20 చరిత్రలో బాబర్ సరికొత్త చరిత్ర.. ఆ ఘనత సాధించిన అతికొద్ది మందిలో ఒకరిగా
Babar Azam: పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్ మరో అరుదైన ఘనత సాధించాడు. T20 క్రికెట్‌లో 100 అర్ధశతకాలు పూర్తి చేసి ప్రపంచ క్రికెట్‌లో తన స్థాయిని మరింత బలపరుచుకున్నాడు. ఈ రికార్డుతో ఆయన పాకిస్తాన్‌లో నెంబర్ 1గా, ఆసియాలో రెండో స్థానంలో, ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో చరిత్ర
ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న బాబర్ అద్భుత ప్రదర్శన చేశాడు. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేస్తూ 51 బంతుల్లో 71 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో బాబర్ జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా అదే సమయంలో తన 100వ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ఇదిలా ఉంటే బాబర్ ఇప్పటి వరకు మొత్తం 354 మ్యాచ్‌లు, 341 ఇన్నింగ్స్‌లు ఆడగా 100 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తాన్ ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు.
ఆసియాలో ఎలైట్ క్లబ్‌లో బాబర్
T20 క్రికెట్‌లో 100కి పైగా అర్ధశతకాలు చేయడం చాలా పెద్ద విషయం. ఆసియాలో ఈ క్లబ్‌లో చేరిన వారు చాలా కొద్దిమందే. ముందుగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ 419 మ్యాచ్‌ల్లో, 402 ఇన్నింగ్స్‌లు కలిపి 107 హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. ఇప్పుడు బాబర్ ఆజమ్ కూడా ఆ జాబితాలో చేరాడు.
ప్రపంచ స్థాయిలో టాప్ 3లో స్థానం
ప్రపంచంలో T20లో అత్యధిక అర్ధశతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నాడు. టాప్ ప్లేయర్ల విషయానికొస్తే 116 హాఫ్ సెంచరీలతో డేవిడ్ వార్నర్ మొదటి స్థానంలో ఉండగా 107 హాఫ్ సెంచరీలతో కోహ్లి రెండో స్థానంలో, 100 హాఫ్ సెంచరీలతో బాబార్ మూడో స్థానంలో ఉన్నాడు.




