India T20 Squad: టీ20 కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. వైస్ కెప్టెన్‌గా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ!

India T20 Squad: టీమ్‌ఇండియా టీ20 జట్టులో బీసీసీఐ పెను మార్పులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించగా.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

Arun Chilukuri
Published on: 6 Jun 2026 2:30 PM IST
India T20 Squad
X

India T20 Squad: టీ20 కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. వైస్ కెప్టెన్‌గా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ!

India T20 Squad: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమ్‌ఇండియా టీ20 జట్టుకు సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 ఫార్మాట్‌కు కొత్త సారథిని ప్రకటిస్తూ సెలక్షన్ కమిటీ భేటీ అనంతరం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో స్క్వాడ్‌లను విడుదల చేసింది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు టీ20 కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అదే సమయంలో తెలుగు క్రికెట్ అభిమానులకు తీపి కబురు అందిస్తూ.. యువ సంచలనం తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించింది.

ఈసారి సెలక్టర్లు సీనియర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను కనీసం స్క్వాడ్‌లోకి కూడా ఎంపిక చేయకపోవడం గమనార్హం. కాగా, యువ ప్రతిభావంతులు ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీలకు జట్టులో చోటు దక్కింది. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ (Asian Games) కోసం సెలక్టర్లు దాదాపు ఒకే కోర్ టీమ్‌ను కొనసాగించారు. అయితే, ఆసియా గేమ్స్ షెడ్యూల్ నాటికి సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి రానుండగా.. మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్‌లకు ఆ టోర్నీ నుంచి విశ్రాంతి కల్పించారు.

1. ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్‌ల పూర్తి స్క్వాడ్:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, నితీశ్‌ కుమార్‌రెడ్డి, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్‌ దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్‌ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రిన్స్ యాదవ్.

ఐర్లాండ్ టూర్ షెడ్యూల్ (2026):

జూన్ 26: తొలి టీ20 మ్యాచ్‌

జూన్ 28: రెండో టీ20 మ్యాచ్‌

ఇంగ్లాండ్ టూర్ షెడ్యూల్ (2026):

జులై 1: తొలి టీ20 మ్యాచ్

జులై 4: రెండో టీ20 మ్యాచ్

జులై 7: మూడో టీ20 మ్యాచ్

జులై 9: నాలుగో టీ20 మ్యాచ్

జులై 11: ఐదో టీ20 మ్యాచ్

2. ఆసియా గేమ్స్ టీమ్‌ఇండియా స్క్వాడ్:

సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఆసియా గేమ్స్ కోసం బీసీసీఐ ప్రకటించిన ప్రత్యేక జట్టు ఇదే. శ్రేయస్‌ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్‌ రెడ్డి, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్‌ దూబే, వరుణ్‌ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ, జస్‌ప్రీత్ బుమ్రా.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story