Bumrah: ఇంగ్లండ్ గడ్డపై బుమ్రా సరికొత్త చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలేదు!
Jasprit Bumrah Creates History in England: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Bumrah: ఇంగ్లండ్ గడ్డపై బుమ్రా సరికొత్త చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలేదు!
Most ODIs wickets for India in England: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌లో అత్యధిక వన్డే వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లీష్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేయడంతో బుమ్రా ఖాతాలో ఈ రికార్డు చేరింది. బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 31 వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ ముందు వరకు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (30 వికెట్స్)తో కలిసి బుమ్రా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు జడ్డును అధిగమించి టాప్ లేపాడు.
జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతిని (14వ్ ఓవర్ మొదటి బంతి) హ్యారీ బ్రూక్ డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతుల్లో పడింది. దీంతో బ్రూక్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ వికెట్‌తో బుమ్రా ఖాతాలో 150వ వన్డే వికెట్ చేరింది. అంతేకాదు ఇంగ్లండ్ గడ్డపై భారత తరఫున అత్యధిక వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో రవీంద్ర జడేజా (30 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (28 వికెట్లు), మదన్ లాల్ (27 వికెట్లు), మహ్మద్ షమీ (28 వికెట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ రికార్డు జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ బౌలర్లకు కూడా సాధ్యం కాలేదు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు వరుస షాక్‌లు ఇచ్చారు. 14 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. బుమ్రా తన లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టగా.. గుర్నూర్ బ్రార్ రెండు వికెట్స్ తీశాడు. భారత బౌలింగ్ దళం మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరొందిన బుమ్రా.. మరోసారి కీలక సమయంలో వికెట్ సాధించి తానేంటో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ గడ్డపై భారత క్రికెట్ చరిత్రలో మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2026 అనంతరం బుమ్రా ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇదే.
ఇంగ్లండ్‌లో భారత బౌలర్ల అత్యధిక వన్డే వికెట్లు:
31 వికెట్లు – జస్ప్రీత్ బుమ్రా
30 వికెట్లు – రవీంద్ర జడేజా
28 వికెట్లు – భువనేశ్వర్ కుమార్
27 వికెట్లు – మదన్ లాల్
26 వికెట్లు – మహ్మద్ షమీ
తుది జట్లు:
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లండ్: జాకబ్ బెతెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, సామ్ కరన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, అదిల్ రషీద్.




