CSK vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. తుది జట్లు ఇవే!
CSK vs KKR: చెన్నై, కోల్‌కతా జట్లు చెపాక్ వేదికగా మరికొద్దిసేపట్లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు.
CSK vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. తుది జట్లు ఇవే!
CSK vs KKR: ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మరికొద్దిసేపట్లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు.
గత మ్యాచ్‌లో ఓడిపోయినా జట్టు ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నామని, అదే ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్‌లో మంచి ఆరంభం ఇవ్వాలని ఆశిస్తున్నామని రహానే తెలిపాడు. టీమ్ కాంబినేషన్ కూడా బాగుందని, చిన్నచిన్న విషయాల్లో మెరుగుపడితే విజయం సాధించవచ్చని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. నవదీప్ సైని స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు.
మరోవైపు చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. చెపాక్ పిచ్‌లో పెద్దగా మార్పులు లేవని, మంచి స్కోర్ చేయడం సవాల్ అయినప్పటికీ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. గత మ్యాచ్‌లో బలమైన జట్టుపై 210 పరుగులను డిఫెండ్ చేసిన బౌలింగ్ యూనిట్‌పై విశ్వాసం పెరిగిందని,
ఫీల్డింగ్ కూడా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నాడు. పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లు.. ఈ మ్యాచ్ గెలిచి తిరిగి ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాయి. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇంపాక్ట్ ప్లేయర్లుగా స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్, నవదీప్ సైని, మ్యాథ్యూ షార్ట్, అకేల్ హొసేన్, మ్యాట్ హెన్రీలు ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఆడుతున్నారు.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్ర్కిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి.
చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబె, డెవాల్డ్ బ్రెవిస్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
కేకేఆర్: ఫిన్ అలెన్, మనీశ్ పాండే, తేజస్వి దహియా, టిమ్ సీఫర్ట్, నవదీప్ సైని.
సీఎస్కే: మ్యాథ్యూ షార్ట్, అకేల్ హొసేన్, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, మ్యాట్ హెన్రీ.




