వన్డే అరంగేట్రంలోనే శతక్కొట్టాడు.. కట్‌చేస్తే.. క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన స్టార్ ప్లేయర్..!

Colin Ingram retirement: ఇంగ్లండ్ (England) ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ (Mark Wood) అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పగా, వన్డే అరంగేట్రంలోనే సెంచరీ బాదిన దక్షిణాఫ్రికా (South Africa) బ్యాటర్ కొలిన్ ఇన్‌గ్రామ్ (Colin Ingram) అన్ని రకాల ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Venkat
Published on: 22 Sept 2026 6:52 PM IST
Colin Ingram retirement
X

వన్డే అరంగేట్రంలోనే శతక్కొట్టాడు.. కట్‌చేస్తే.. క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన స్టార్ ప్లేయర్..!

Colin Ingram retirement: దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ లిఖించుకున్న 41 ఏళ్ల సీనియర్ బ్యాటర్ కొలిన్ ఇన్‌గ్రామ్ ప్రొఫెషనల్ క్రికెట్ ప్రయాణాన్ని ముగించాడు. 2010లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికైన ఆయన, 2013 వరకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత అంతర్జాతీయ ఆటకు దూరమైనప్పటికీ కౌంటీ క్రికెట్ (County Cricket), వివిధ దేశాల ఫ్రాంచైజీ లీగ్స్‌లో సుదీర్ఘకాలం రాణించాడు. కౌంటీల్లో గ్లామోర్గాన్ (Glamorgan) క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ తన చివరి మ్యాచ్ ఆడాడు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన సాధారణ కుర్రాడిగా క్రికెట్ ఆడాలనే కల కన్నానని, గత ఇరవై ఏళ్లకు పైగా ఆ కలను నిజం చేసుకుంటూ జీవించడం అదృష్టంగా భావిస్తున్నానని తన వీడ్కోలు ప్రకటనలో భావోద్వేగంగా రాసుకొచ్చాడు.

తొలి వన్డేలోనే సెంచరీ సాధించిన అరుదైన బ్యాటర్లలో ఇన్‌గ్రామ్ ఒకడు. 2010లో జింబాబ్వే (Zimbabwe) జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఏకంగా 124 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రోటీస్ చరిత్రలోనే వన్డే అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ సమయంలో డెబ్యూ మ్యాచ్‌లో నమోదైన రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఇది గుర్తింపు పొందింది.

అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో మొత్తం 31 మ్యాచ్‌లు ఆడిన ఆయన 32 సగటుతో 843 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, మరో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. పొట్టి ఫార్మాట్‌ను పరిశీలిస్తే 9 అంతర్జాతీయ టీ20 (T20I) మ్యాచ్‌ల్లో బరిలోకి దిగి 210 పరుగులు నమోదు చేశాడు.

ఒకేరోజు అటు ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ మార్క్ వుడ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ముగింపు పలకడం, ఇటు కొలిన్ ఇన్‌గ్రామ్ పూర్తిస్థాయి ప్రొఫెషనల్ క్రికెట్ బరిని వీడటంతో క్రికెట్ వర్గాల్లో ఈ రిటైర్మెంట్ల వార్త ప్రధాన చర్చగా మారింది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.