Cooper Connolly: అరంగేట్రంలోనే అదుర్స్.. ఐపీఎల్ చరిత్రలో దిగ్గజాల సరసన కూపర్‌ కనోలీ!

Cooper Connolly IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ విజయంతో ఆరంభించింది. చండీగఢ్‌లో మంగళవారం రాత్రి హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది.

Rishvik
Published on: 1 April 2026 9:17 PM IST
Cooper Connolly IPL 2026 Debut Heroics: Joins McCullum, Hussey in Elite List
X

Cooper Connolly

Cooper Connolly IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ విజయంతో ఆరంభించింది. చండీగఢ్‌లో మంగళవారం రాత్రి హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది. 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ మరో ఐదు బంతులు ఉండగేం 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్‌ విజయంలో ఆస్ట్రేలియా కుర్రాడు కూపర్‌ కనోలీ కీలక పాత్ర పోషించాడు. 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రెండో ఓవర్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కూపర్‌.. ఓవైపు వికెట్స్ పడుతున్నా క్రీజులో పాతుకుపోయాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో దిగ్గజాల సరసన కూపర్‌ నిలిచాడు.

ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక రన్స్ చేసిన ఐదవ ఆటగాడిగా కూపర్‌ కనోలీ నిలిచాడు. ఐపీఎల్ తొలి సీజన్‌ (2008)లోనే బ్రెండన్ మెక్‌కల్లమ్ సంచలన ప్రదర్శన చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆర్సీబీపై 158 పరుగులు చేసి లీగ్ చరిత్రలోనే అత్యధిక అరంగేట్ర స్కోర్ నమోదు చేశాడు. ఆ ఇన్నింగ్స్ ఐపీఎల్‌కు గ్రాండ్ స్టార్ట్ ఇచ్చింది. అదే సీజన్‌లో మైఖేల్ హస్సీ కూడా తన సత్తా చాటాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 116 పరుగులు చేసి తన క్లాస్‌ను చూపించాడు. షాన్ మార్ష్ 84 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ముగ్గరు కూడా నాటౌట్‌గా నిలిచారు.

2023లో కైల్ మేయర్స్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఢిల్లీపై 73 పరుగులు చేసి ఐపీఎల్ అరంగేట్రంలోనే తన సత్తా చూపించాడు. ఇక ఐపీఎల్ 2026లో కొత్త సంచలనం సృష్టించిన ఆటగాడు కూపర్‌ కనోలీ. పంజాబ్ కింగ్స్ తరఫున గుజరాత్ టైటాన్స్‌పై 72 పరుగులు చేసి అరంగేట్రంలోనే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు భవిష్యత్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్ అరంగేట్రంలోనే భారీ స్కోర్లు చేయడం చాలా అరుదైన విషయం. కానీ ఈ ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్‌ల్లోనే అసాధారణ ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story