Cricket: క్రికెట్ అభిమానుల‌కు కిక్కిచ్చే న్యూస్‌.. ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎంట్రీ.?

Cricket: క్రికెట్ ఆట మళ్లీ ఒలింపిక్స్‌లోకి రావడానికి మార్గం సుగమమవుతోంది. 128 సంవత్సరాల తర్వాత ఈ క్రీడ తిరిగి ఒలింపిక్స్‌లో చోటు సంపాదించబోతోంది.

Mokshith
Published on: 24 April 2026 3:08 PM IST
Cricket
X

Cricket

Cricket: క్రికెట్ ఆట మళ్లీ ఒలింపిక్స్‌లోకి రావడానికి మార్గం సుగమమవుతోంది. 128 సంవత్సరాల తర్వాత ఈ క్రీడ తిరిగి ఒలింపిక్స్‌లో చోటు సంపాదించబోతోంది. చివరిసారిగా 1900లో మాత్రమే క్రికెట్ ఒలింపిక్స్‌లో కనిపించింది. ఇప్పుడు మళ్లీ ప్రపంచ స్థాయిలో ఈ క్రీడకు గుర్తింపు పెరుగుతోంది.

కాలిఫోర్నియాలో ప్రత్యేక స్టేడియం నిర్మాణం ప్రారంభం

అమెరికాలోని పొమొనా నగరంలో క్రికెట్ కోసం ప్రత్యేక స్టేడియం నిర్మాణం ప్రారంభమైంది. లాస్ ఏంజిలెస్ 2028 ఒలింపిక్స్‌ కోసం ఈ వేదికను సిద్ధం చేస్తున్నారు. లాస్ ఏంజెల్స్ కౌంటీలోని ఫెయిర్‌ప్లెక్స్ గ్రౌండ్స్‌లో ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఇది చారిత్రాత్మక ఘట్టం

ఇంట‌ర్నేష‌న్ క్రికెట్ కౌన్సిల్ ఈ ప్రాజెక్ట్‌ను చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించింది. ICC చైర్మన్ జ‌య్ షా మాట్లాడుతూ, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది క్రికెట్ అభిమానులకు గొప్ప అవకాశం అని అన్నారు. ఈ వేదిక అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు.

T20 ఫార్మాట్‌లో పురుషులు, మహిళల పోటీలు

2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు T20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. పురుషులు, మహిళల విభాగాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇది కొత్త తరానికి క్రికెట్‌ను మరింత చేరువ చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

అమెరికాలో క్రికెట్ విస్తరణకు దారి

ఈ స్టేడియం ఒలింపిక్స్‌కే కాకుండా ముందుగా జరిగే మ్యాచ్‌లకు కూడా ఉపయోగపడనుంది. ముఖ్యంగా మేజర్ లీగ్ క్రికెట్ పోటీలు, లాస్ ఏంజిలెస్ నైట్ రైడ‌ర్స్ వంటి జట్ల మ్యాచ్‌లు ఇక్కడ నిర్వహించనున్నారు. దీని వల్ల అమెరికాలో క్రికెట్‌కు మంచి ప్రాచుర్యం లభిస్తుంది.

భవిష్యత్తులో భారీ మార్పులకు నాంది

క్రికెట్ ఒలింపిక్స్‌లోకి రావడం వల్ల కొత్త దేశాల్లో ఈ ఆట విస్తరించే అవకాశం ఉంది. ప్రభుత్వాల మద్దతు పెరగడంతో పాటు కొత్త ఆటగాళ్లు ముందుకు రావడానికి ఇది సహాయపడుతుంది. ఇప్పటికే ఉన్న శక్తివంతమైన జట్లతో పాటు కొత్త జట్లు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story