Tilak Varma: సీఎం రేవంత్‌ను కలిసిన క్రికెటర్‌ తిలక్‌ వర్మ

Tilak Varma: సీఎం రేవంత్‌రెడ్డిని క్రికెటర్‌ తిలక్‌ వర్మ మర్యాదపూర్వకంగా కలిశాడు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 17 March 2026 12:01 PM IST
Tilak Varma: సీఎం రేవంత్‌ను కలిసిన క్రికెటర్‌ తిలక్‌ వర్మ
X

Tilak Varma: సీఎం రేవంత్‌ను కలిసిన క్రికెటర్‌ తిలక్‌ వర్మ

Tilak Varma: సీఎం రేవంత్‌రెడ్డిని క్రికెటర్‌ తిలక్‌ వర్మ మర్యాదపూర్వకంగా కలిశాడు. టీ20 వరల్డ్‌కప్‌ అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన టీమిండియా ప్లేయర్‌ తిలక్‌ వర్మ.. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ నివాసానికి వెళ్లి కలిశాడు. ఈ సందర్భంగా.. తిలక్‌ వర్మను రేవంత్‌ అభినందించి.. శాలువాతో సత్కరించారు. 2026 టీ20 వరల్డ్‌కప్‌ గెలిచి.. దేశం గర్వపడేలా చేసినందుకు గాను తిలక్‌ వర్మకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్‌, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, SATG చైర్మన్‌ శివసేనారెడ్డి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండీ సోనీ బాలాదేవి పాల్గొన్నారు. అంతకుముందు.. తిలక్‌ వర్మకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దగ్గర అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తిలక్‌ హైదరాబాద్‌కు వస్తున్న విషయం తెలుసుకొని.. ఎయిర్‌పోర్టుకు భారీగా అభిమానులు చేరుకున్నారు. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణం సందడిగా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story