IPL 2026-CSK: సీఎస్‌కే గేమ్ ఛేంజింగ్ ప్లాన్‌, టైటిలే టార్గెట్.. హింట్ ఇచ్చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్!

IPL 2026-CSK: ఐపీఎల్ 2026 సీజన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. గత సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శన చేసిన సీఎస్‌కే.. ఈసారి టైటిలే టార్గెట్‌గా వస్తోంది. ఈ క్రమంలో టాప్ ఆర్డర్‌ను పూర్తిగా మార్చాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.

Rishvik
Published on: 26 March 2026 6:00 PM IST
IPL 2026-CSK
X

IPL 2026-CSK: సీఎస్‌కే గేమ్ ఛేంజింగ్ ప్లాన్‌, టైటిలే టార్గెట్.. హింట్ ఇచ్చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్!

IPL 2026-CSK:ఐపీఎల్ 2026 సీజన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. గత సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శన చేసిన సీఎస్‌కే.. ఈసారి టైటిలే టార్గెట్‌గా వస్తోంది. ఈ క్రమంలో టాప్ ఆర్డర్‌ను పూర్తిగా మార్చాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఐపీఎల్‌ 2026 కెప్టెన్స్‌ డే ఈవెంట్‌ సందర్భంగా దీనిపై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హింట్ ఇచ్చాడు. ఓపెనింగ్ కాంబినేషన్‌పై క్లారిటీ ఇచ్చిన రుతురాజ్.. తానే ఓపెనర్‌గా బరిలోకి దిగుతానని ప్రకటించాడు. అతనితో పాటు వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

బుధవారం ముంబైలో జరిగిన ఐపీఎల్ 2026 కెప్టెన్స్ మీట్‌లో మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్.. ఈసారి కొత్త కాంబినేషన్‌తో ఇన్నింగ్స్ ప్రారంభిస్తామని తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ ద్వారా సీఎస్‌కేలోకి వచ్చిన సంజు శాంసన్‌తో కలిసి తాను ఓపెనింగ్ చేస్తానని స్పష్టం చేశాడు. ఈ జోడీతో జట్టుకు మంచి ఆరంభం లభిస్తుందని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ భావిస్తోంది. గత సీజన్‌లో సీఎస్‌కే టాప్ ఆర్డర్ తీవ్రంగా విఫలమైంది. రుతురాజ్ ఎక్కువగా నంబర్ 3లో బ్యాటింగ్ చేయగా.. ఓపెనింగ్‌లో రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి వంటి ఆటగాళ్లను మార్చుతూ ప్రయోగాలు చేశారు. అయితే ఏ కాంబినేషన్ కూడా సక్సెస్ కాలేదు. చివర్లో రీప్లేస్‌మెంట్ ప్లేయర్లుగా వచ్చిన యువ ఆటగాళ్లు ఆయుష్ మాత్రే, డేవాల్డ్ బ్రెవిస్ మాత్రమే ప్రభావం చూపించారు.

ఆయుష్ మాత్రే గత సీజన్‌లో 7 ఇన్నింగ్స్‌ల్లో 240 పరుగులు చేసి మంచి స్ట్రైక్ రేట్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆర్‌సీబీపై చేసిన 94 పరుగుల ఇన్నింగ్స్ అతడి టాలెంట్‌ను ప్రపంచానికి చాటి చెప్పాడు. అలాగే డేవాల్డ్ బ్రెవిస్ కూడా 6 ఇన్నింగ్స్‌ల్లో 225 పరుగులు చేసి తన దూకుడు చూపించాడు. అయినప్పటికీ ఈసారి సీఎస్‌కే సీనియర్ ఆటగాళ్లపై నమ్మకం ఉంచింది. ఆయుష్ మాత్రే మూడో స్థానంలో ఆడే అవకాశాలు ఉన్నాయి. డేవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, సర్ఫరాజ్ ఖాన్, ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ లాంటి యువకులు మిడిల్ ఆర్డర్లో ఉన్నారు.

సీనియర్ ప్లేయర్ ఎంఎస్ ధోనీ ఏ స్థానాల్లో ఆడుతాడో ఇంకా క్లారిటీ లేదు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతాడని న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. అలానే మహీకి ఇదే చివరి సీజన్ అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక ఐపీఎల్ 2026లో సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌ను మార్చి 30న గువాహటిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. అనంతరం ఏప్రిల్ 3న చెన్నైలో పంజాబ్ కింగ్స్‌తో, ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ హోమ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. కొత్త ఓపెనింగ్ జోడీతో సీఎస్‌కే ఈసారి బలంగా తిరిగి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story