CSK vs GT: సాయి సుదర్శన్ సూపర్ షో.. చెన్నైపై గుజరాత్ గ్రాండ్ విక్టరీ!
CSK vs GT: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం ఎం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది.
CSK vs GT: సాయి సుదర్శన్ సూపర్ షో.. చెన్నైపై గుజరాత్ గ్రాండ్ విక్టరీ!
CSK vs GT: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం ఎం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. చెన్నై నిర్ధేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.2 ఓవర్లలో రెండు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (87; 46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో గుజరాత్ సులభంగా లక్ష్యానికి చేరుకుంది. ఈ విజయంతో లీగ్‌లో జీటీ తమ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం గుజరాత్ 8 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. ఈ విక్టరీతో జీటీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి. సంజు శాంసన్, ఉర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఓ వైపు వికెట్స్ పడుతున్నా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో నిలబడ్డాడు. 12 ఓవర్లు ముగిసేసరికి కేవలం 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
రుతురాజ్ గైక్వాడ్ అసాధారణ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. కేవలం 30 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జేమీ ఒవర్టన్ (18)తో కలిసి చివరి 8 ఓవర్లలో రుతురాజ్ చెలరేగడంతో చెన్నై 100కు పైగా పరుగులు రాబట్టింది. శివమ్ దూబే (22), కార్తిక్ శర్మ (15) విలువైన రన్స్ చేశారు. చివరకు చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ 3, అర్షద్ ఖాన్ 2, మానవ్ సుతార్ అండ్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్ సాయి సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 46 బంతుల్లో 4 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 87 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేశాడు. అతనికి తోడుగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (33), జోస్ బట్లర్ (39*) రాణించడంతో గుజరాత్ మరో 20 బంతులు మిగిలి ఉండగానే (16.4 ఓవర్లలో) కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో తన స్థానాన్ని మెరుగుపరుచుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది ఈ సీజన్‌లో ఐదో ఓటమి. సీఎస్కే బ్యాటింగ్ లైనప్‌లో రుతురాజ్ మినహా మిగిలిన వారు విఫలం కావడం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది.




