CSK vs KKR: మెరిసిన సంజు శాంసన్‌, డెవాల్డ్ బ్రెవిస్‌.. కోల్‌కతా లక్ష్యం 193!

CSK vs KKR: చిదంబరం స్టేడియంలో చెన్నై, కోల్‌కతా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 రన్స్ చేసింది.

Rishvik
Published on: 14 April 2026 9:38 PM IST
CSK vs KKR
X

CSK vs KKR: మెరిసిన సంజు శాంసన్‌, డెవాల్డ్ బ్రెవిస్‌.. కోల్‌కతా లక్ష్యం 193!

CSK vs KKR: ఐపీఎల్ 2026లో భాగంగా ఎం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 రన్స్ చేసింది. చెన్నై బ్యాటర్లలో సంజు శాంసన్ (48; 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) టాప్ స్కోరర్.

ఆయుష్ మాత్రే (38; 17 బంతుల్లో), డెవాల్డ్ బ్రెవిస్ (41; 28 బంతుల్లో) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి రెండు వికెట్స్ పడగొట్టాడు. 193 పరుగుల లక్ష్యంతో కోల్‌కతా బరిలోకి దిగనుంది. పటిష్టంగా ఉన్న చెన్నై బౌలర్లను కేకేఆర్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. సంజు శాంసన్‌ ధాటిగా 2 ఓవర్లకు చెన్నై స్కోర్‌ 24/0గా నిలిచింది. కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ (7) అనుకుల్‌ రాయ్‌ బౌలింగ్‌లో (2.2) రోవ్‌మన్‌ పావెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సంజుకు ఆయుష్‌ మాత్రే జత కలవడంతో చెన్నై స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

ఆయుష్‌ బౌండరీలు, సిక్సులతో రెచ్చిపోయాడు. అయితే వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో (5.6) రమణ్‌దీప్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఆయుష్‌ అవుట్ అయ్యాడు. డెవాల్డ్ బ్రెవిస్‌, సంజు నిలకడగా ఆడుతూ.. 10 ఓవర్లకు చెన్నై స్కోర్‌ను 10ఓ దాటించారు. ధాటిగా ఆడే క్రమంలో కార్తిక్‌ త్యాగి బౌలింగ్‌లో (11.2) సంజు (48) బౌల్డ్‌ అయ్యాడు.

సర్ఫరాజ్‌ ఖాన్‌ (23)తో కలిసి డెవాల్డ్ బ్రెవిస్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇద్దరు కలిసి 15 ఓవర్లకు చెన్నై స్కోర్‌ను 142/3గా నిలిపారు. బ్రెవిస్‌, సర్ఫరాజ్‌ కలిసి 28 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీని సునీల్ నరైన్‌ (16.1) విడగొట్టాడు. కాసేపటికే కార్తిక్‌ త్యాగి బౌలింగ్‌లో (17.3) బ్రెవిస్‌ అవుట్ అయ్యాడు. చివరి రెండు ఓవర్లలో హిట్టర్లు జెమీ ఓవర్టన్‌ (7), శివమ్‌ దూబె (13) ఉన్నా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై 200 మార్క్ అందుకోలేకపోయింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story