David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. తప్పు ఒప్పుకున్న క్రికెటర్ డేవిడ్ వార్నర్!

David Warner: మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన తప్పును అంగీకరించాడు.

Arun Chilukuri
Published on: 22 July 2026 12:14 PM IST
David Warner
X

David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. తప్పు ఒప్పుకున్న క్రికెటర్ డేవిడ్ వార్నర్!

David Warner: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, బిగ్ బాష్ లీగ్ (BBL) సిడ్నీ థండర్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తన తప్పును అంగీకరించాడు. గత ఏప్రిల్ నెలలో మద్యం తాగి వాహనం నడుపుతూ సిడ్నీ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసును విచారించిన సిడ్నీ స్థానిక కోర్టులో వార్నర్ తరఫు న్యాయవాది అతడి నేరాంగీకారాన్ని సమర్పించారు.

అసలేం జరిగిందంటే?

గత ఏప్రిల్‌లో రోడ్డుపై వెళ్తున్న క్రమంలో పోలీసులు నిర్వహిస్తున్న బ్రీత్ అనలైజర్ టెస్టింగ్‌ను చూసి వార్నర్ తన వాహనాన్ని పక్కనే ఆపేశాడు. వార్నర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసు అధికారులు అతడికి బ్రీత్ టెస్ట్ నిర్వహించగా.. పరిమితికి మించి మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, ఆ తర్వాత వార్నర్ బెయిల్‌పై బయటకు వచ్చాడు.

తాజా విచారణ సందర్భంగా వార్నర్ కోర్టుకు నేరుగా హాజరుకాలేదు. అయితే అతడి తరఫు లాయర్ ద్వారా నేరాన్ని అంగీకరించడంతో వాదనలు విన్న న్యాయస్థానం వార్నర్‌ను దోషిగా తేల్చింది. ఈ కేసులో అతడికి విధించబోయే శిక్షను వచ్చే నెల 18వ తేదీన ఖరారు చేయనున్నట్లు కోర్టు వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story