DC vs PBKS: నిజంగా పంజాబ్ కింగ్సే.. 265 లక్షాన్ని కూడా ఈజీగా ఊదేశారు భయ్యో!

DC vs PBKS: ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్ కింగ్స్ మధ్య అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన రన్ ఫీస్ట్‌గా నిలిచింది.

Rishvik
Published on: 25 April 2026 8:52 PM IST
DC vs PBKS
X

DC vs PBKS: నిజంగా పంజాబ్ కింగ్సే.. 265 లక్షాన్ని కూడా ఈజీగా ఊదేశారు భయ్యో!

DC vs PBKS: ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్ కింగ్స్ మధ్య అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన రన్ ఫీస్ట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 264 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలోనే ఛేదించి రికార్డ్‌ సృష్టించింది.

కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ప్రియాంశ్ ఆర్య 43 పరుగులు, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 76 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్స్ పడగొట్టాడు. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్తు వైపు దూసుకెళుతోంది.

265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రారంభం నుంచే దూకుడుగా ఆడారు. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫోర్లు, బౌండరీలు బాదుతూ పరుగుల వరద పారించారు. దాంతో పవర్‌ప్లేలోనే పంజాబ్ 116 పరుగులు సాధించి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకుంది. ధాటిగా అదే క్రమంలో ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్‌ పెవిలియన్ చేరారు. కూపర్ కొన్నోలీ

(16) త్వరగానే అవుట్ అయినా.. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతుల్లో 71 పరుగులు చేసి చివరి వరకు నిలిచాడు. అతనికి శశాంక్ సింగ్ (19*) మంచి మద్దతు అందించడంతో పంజాబ్ కేవలం 18.5 ఓవర్లలోనే 265/4 స్కోర్ చేసి 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 264/2 భారీ స్కోర్ నమోదు చేసింది. కేఎల్ రాహుల్ (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. అతనికి తోడుగా నితీష్ రాణా 91 పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోర్‌ చేసింది. అయితే చివరికి ఈ భారీ ఇన్నింగ్స్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది.

ఐపీఎల్ చరిత్రలో ఇదే రికార్డు ఛేదనగా నిలిచింది. 2024లో కోల్‌కతా నిర్దేశించిన 262 రన్స్ టార్గెట్‌ని పంజాబ్ కింగ్స్ ఛేజ్ చేసింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లకు వికెట్స్ తీసే అవకాశం పెద్దగా లేకపోయింది. బ్యాట్స్‌మెన్ పండగ చేసుకున్నారు. పవర్‌ప్లేలో పంజాబ్ చూపిన దూకుడు ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ పేసర్ లుంగి ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story