IND vs NZ Test: ధ్రువ్ జురెల్ వీరోచిత హాఫ్ సెంచరీ.. న్యూజిలాండ్ గడ్డపై విరాట్ కోహ్లీ రికార్డు సమం!
IND vs NZ Test: క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ధ్రువ్ జురెల్ అద్భుత హాఫ్ సెంచరీ సాధించాడు.
IND vs NZ Test: ధ్రువ్ జురెల్ వీరోచిత హాఫ్ సెంచరీ.. న్యూజిలాండ్ గడ్డపై విరాట్ కోహ్లీ రికార్డు సమం!
IND vs NZ Test: క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత పోరాట పటిమను కనబరిచాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి, అత్యంత బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్లో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో పాటు, న్యూజిలాండ్ గడ్డపై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును సమం చేసి ప్రత్యేక జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ఒక ప్యూర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన జురెల్, రెండో రోజు చివరి సెషన్లో భారత్ 104/5 స్కోరుతో కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి అడుగుపెట్టాడు. టాప్ ఆర్డర్ విఫలమైన వేళ కివీస్ బౌలర్ల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.
మొదట వాషింగ్టన్ సుందర్‌తో కలిసి కేవలం 12 పరుగులే జోడించినప్పటికీ, ఏకంగా 91 బంతులు ఎదుర్కొని ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అనంతరం టెయిలెండర్లు ఆకాష్ దీప్, గుర్నూర్ బ్రార్‌లతో కలిసి కీలకమైన 40+ పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పి, మూడో రోజు లంచ్ సమయానికి న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 150 పరుగులకు తగ్గించడంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుత న్యూజిలాండ్ పర్యటనలో జురెల్‌కు ఇది వరుసగా రెండో యాభై ప్లస్ స్కోరు. ఈ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక యాభై ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ సరసన జురెల్ నిలిచాడు. న్యూజిలాండ్‌లో ఇప్పటివరకు నాలుగు టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ 36 సగటుతో ఒక సెంచరీ (2014లో వెల్లింగ్టన్లో 105*), ఒక హాఫ్ సెంచరీతో మొత్తం రెండు యాభై ప్లస్ స్కోర్లు సాధించాడు.
ఇప్పుడు ధ్రువ్ జురెల్ కూడా కివీస్ గడ్డపై రెండు యాభై ప్లస్ స్కోర్లు నమోదు చేసి కోహ్లీతో సమానంగా నిలిచాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకుని జురెల్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌పై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు.




