Cricketers Birthday: మే నెలలో పుట్టిన ప్రముఖ క్రికెటర్లు.. క్రికెట్ చరిత్రలో ప్రత్యేక ముద్ర, ఫుల్ లిస్ట్ ఇదే!

Cricketers Birthday: క్రికెట్ ప్రపంచంలో ఎందరో గొప్ప ఆటగాళ్లు తమ అద్భుత ప్రతిభతో అభిమానులను అలరించారు. అలాంటి స్టార్ క్రికెటర్లలో పలువురు మే నెలలో జన్మించడం విశేషం.

Rishvik
Published on: 30 April 2026 6:26 PM IST
Cricketers Birthday
X

Cricketers Birthday: మే నెలలో పుట్టిన ప్రముఖ క్రికెటర్లు.. క్రికెట్ చరిత్రలో ప్రత్యేక ముద్ర, ఫుల్ లిస్ట్ ఇదే!

Cricketers Birthday: క్రికెట్ ప్రపంచంలో ఎందరో గొప్ప ఆటగాళ్లు తమ అద్భుత ప్రతిభతో అభిమానులను అలరించారు. అలాంటి స్టార్ క్రికెటర్లలో పలువురు మే నెలలో జన్మించడం విశేషం. వివిధ దేశాలకు చెందిన ఈ ఆటగాళ్లు తమ ఆట తీరుతో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఫాస్ట్ బౌలింగ్ నుంచి స్పిన్ వరకు, క్లాసిక్ బ్యాటింగ్ నుంచి అగ్రెసివ్ స్ట్రోక్‌ప్లే వరకు.. ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లు క్రికెట్‌కు ఎన్నో మధుర క్షణాలు అందించారు. మే నెలలో పుట్టిన క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

కగిసో రబాడ:

1995 మే 25న దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ జన్మించాడు. తన వేగం, అద్భుత లైన్-లెంగ్త్‌తో ప్రపంచ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే రబాడ.. ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడుగా ఉన్నాడు. 30 ఏళ్ల రబాడ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరఫున 73 టెస్టులు, 106 వన్డేలు, 79 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి దాదాపుగా 600 వికెట్స్ పడగొట్టాడు. ఐపీఎల్ 2026లో అతడు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు.

మహేళ జయవర్ధనే:

1977 మే 27న శ్రీలంక దిగ్గజ బ్యాటర్ మహేళ జయవర్ధనే జన్మించాడు. తన క్లాసిక్ బ్యాటింగ్ స్టైల్‌తో అభిమానవులను అలరించాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లతో లంక జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. లంక తరఫున 149 టెస్టులు, 448 వన్డేలు, 55 టీ20లు ఆడాడు. మొత్తంగా 26 వేలకు పైగా రన్స్ చేశాడు.

బి.ఎస్. చంద్రశేఖర్:

భారత క్రికెట్ చరిత్రలో ప్రముఖ స్పిన్నర్ బి.ఎస్. చంద్రశేఖర్ మే 17, 1945న జన్మించాడు. తన లెగ్ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఆయన.. ఓ సమయంలో భారత బౌలింగ్‌లో కీలక పాత్ర పోషించాడు. మే 15న ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ ఇస్సీ వాంగ్ (2002) జన్మించింది. 23 ఏళ్ల ఇస్సీ యువ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది.

మన్సూర్ అలీ ఖాన్:

మే 1న భారత ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్, మే 15న సుయాష్ శర్మ, మే 16న డిర్క్ నానెస్ అండ్ కిరణ్ కార్ల్సన్, మే 22న భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్, మే 25న తాజిందర్ సింగ్, మే 28న శ్రీలంకకు చెందిన లహిరు మిలాంత జన్మించారు. ఈ జాబితా చూస్తే మే నెల క్రికెట్ ప్రపంచానికి ఎంత ప్రత్యేకమో అర్థమవుతోంది. వివిధ తరాల ఆటగాళ్లు ఈ నెలలో జన్మించి తమ దేశాలకు గొప్ప విజయాలు అందించారు. భవిష్యత్తులో కూడా ఈ నెలలో పుట్టిన యువ ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్‌లో సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story