Fanny Utagushimaninde: సంచలన ఇన్నింగ్స్.. అంతర్జాతీయ టీ20ల్లో చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల రువాండా బ్యాటర్!
అంతర్జాతీయ మహిళా టీ20 క్రికెట్‌లో రువాండా యువ బ్యాటర్ ఫ్యానీ ఉటాగుషిమానిండే చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో అతిపిన్న వయసులో సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది.
Fanny Utagushimaninde: సంచలన ఇన్నింగ్స్.. అంతర్జాతీయ టీ20ల్లో చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల రువాండా బ్యాటర్!
Fanny Utagushimaninde:అంతర్జాతీయ మహిళా టీ20 క్రికెట్‌లో రువాండా యువ బ్యాటర్ ఫ్యానీ ఉటాగుషిమానిండే చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో అతిపిన్న వయసులో సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. నైజీరియాలోని లాగోస్‌లో జరిగిన నైజీరియా ఇన్విటేషనల్ మహిళల టీ20 టోర్నీలో ఘానా జట్టుపై ఫ్యానీ 65 బంతుల్లో 17 ఫోర్లతో 111 రన్స్ చేసింది. కేవలం 15 సంవత్సరాల 223 రోజుల్లోనే సెంచరీ సాధించి.. మహిళల టీ20 చరిత్రలో అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది.
ఇంతకుముందు ఈ రికార్డు ఉగాండా క్రికెటర్ ప్రోస్కోవియా అలకో పేరిట ఉండేది. ఆమె 2019లో 16 సంవత్సరాలు 233 రోజుల్లో మాలీపై సెంచరీ సాధించింది. ఇప్పుడు ఫ్యానీ ఉటాగుషిమానిండే 65 బంతుల్లో 111 పరుగులు చేసి ఆ రికార్డును అధిగమించింది. మరో విశేషం ఏమిటంటే.. ఫ్యానీ తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన తొలి మహిళగా కూడా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ కారెన్ రోల్టన్ 2005లో ఇంగ్లాండ్‌పై చేసిన 96 నాటౌట్ రికార్డును అధిగమించింది. 111 రన్స్ చేయడంతో.. మహిళల అంతర్జాతీయ టీ20 అరంగేట్రంలో అత్యధిక స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గానూ ఫ్యానీ నిలిచింది.
పురుషుల టీ20లో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు మాత్రం ఫ్రాన్స్ ఆటగాడు గుస్తావ్ మెక్‌కీన్ పేరిట ఉంది. అతను 2022లో 18 సంవత్సరాలు 280 రోజుల్లో స్విట్జర్లాండ్‌పై సెంచరీ సాధించాడు. దీంతో ఫ్యానీ ఉటాగుషిమానిండే అంతర్జాతీయంగా చూసుకుంటే.. అతి తక్కువ వయసులోనే శతకం చేసిన క్రికెటర్‌గా అవతరించింది. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. ఇక ఫ్యానీ అద్భుత శతకంతో రువాండా మహిళల జట్టు ఘానాపై భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రువాండా 20 ఓవర్లలో 210/3 భారీ స్కోరు నమోదు చేసింది. గిజెలే ఇషిమ్వే (14), క్లారిస్ ఉవాసే (15), మర్వెల్ ఉవాసే (32) తమ వంతు సహకారం అందించారు.
లక్ష్య ఛేదనకు దిగిన ఘానా జట్టు 20 ఓవర్లలో 88/8 మాత్రమే చేసి ఓటమి చవిచూసింది. రువాండా బౌలర్ బెలీస్ మురేకటేట్ 3/20 వికెట్లు తీసి ఆకట్టుకుంది. మేరీ బిమెన్యిమానా, హెన్రియెట్ ఇషిమ్వే, మర్వెల్ ఉవాసే కూడా కీలక వికెట్లు తీశారు. ఘానా తరఫున కేట్ అవుహా (31) మాత్రమే టాప్ స్కోరర్. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఉటాగుషిమానిండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆమె చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో రువాండా జట్టు టోర్నీలో బలమైన పోటీదారుగా నిలిచింది.




