FIFA వరల్డ్ కప్ ఫైనల్‌కు అర్జెంటీనా..ఫిక్సింగ్ అంటూ 75 లక్షల మంది నిరసన
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్స్ చేరిన అర్జెంటీనా. ఇంగ్లాండ్‌పై మెస్సీ సేన అద్భుత విజయం.
FIFA వరల్డ్ కప్ ఫైనల్‌కు అర్జెంటీనా..ఫిక్సింగ్ అంటూ 75 లక్షల మంది నిరసన
FIFA World Cup: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ చివరి అంకానికి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరోసారి తన సత్తా చాటుతూ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఒకవైపు మెస్సీ సేన టైటిల్ వేటలో దూసుకుపోతుంటే.. మరోవైపు నెట్టింట ఆ జట్టును టోర్నీ నుంచి బహిష్కరించాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పిచ్‌పై ఆట, పిచ్ బయట వివాదాలతో ఈ మెగా టోర్నీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
సెమీ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ జట్టుపై అర్జెంటీనా 2-1 తేడాతో సాధించిన గ్రాండ్ విక్టరీ ఫుట్‌బాల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్‌బ్యాక్‌గా నిలిచిపోతుంది. మ్యాచ్ ప్రారంభంలో 1-0 తేడాతో వెనుకబడిన అర్జెంటీనా.. చివరి నిమిషాల్లో ఆటను ఊహించని విధంగా తమ వైపు తిప్పుకుంది. కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే రెండు బ్యాక్-టు-బ్యాక్ గోల్స్ కొట్టి ఇంగ్లాండ్‌కు షాకిచ్చింది.
లెజెండరీ ప్లేయర్ లియోనెల్ మెస్సీ అందించిన రెండు అద్భుతమైన అసిస్ట్‌లను.. ఫెర్నాండెజ్, మార్టినెజ్ క్లినికల్ గోల్స్‌గా మలిచి జట్టుకు సూపర్ విక్టరీని అందించారు. ఈ విజయంతో ఈ నెల 20వ తేదీన న్యూ జెర్సీలోని ప్రసిద్ధ న్యూయార్క్ న్యూ జెర్సీ స్టేడియం వేదికగా జరగబోయే హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్‌తో అర్జెంటీనా తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఎపిక్ ఫైనల్ మ్యాచ్ ఎర్లీ మార్నింగ్ 12:30 గంటలకు షురూ కానుంది.
అర్జెంటీనా ఫైనల్ చేరిన ఆనందంలో ఉండగానే, సోషల్ మీడియాలో ఆ జట్టుకు వ్యతిరేకంగా ఒక పెద్ద తుఫాను ముంచుకొచ్చింది. అర్జెంటీనా జట్టును ఫిఫా వరల్డ్ కప్ నుంచి తక్షణమే తొలగించాలంటూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. https://argentinaout.com/ అనే వెబ్‌సైట్‌లో ఏకంగా 75 లక్షలకు పైగా సంతకాల సేకరణ జరగడం ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
సూపర్ 16 దశలో ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో రిఫరీ తీసుకున్న ఒక పెనాల్టీ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. క్వార్టర్ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక కీలకమైన ఆఫ్‌సైడ్ నిర్ణయం అర్జెంటీనాకు అనుకూలంగా వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. రిఫరీలు కావాలనే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ, అర్జెంటీనాను టోర్నమెంట్‌లో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని ప్రత్యర్థి జట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఆన్‌లైన్ పిటిషన్‌కు లక్షల్లో మద్దతు లభిస్తున్నప్పటికీ, ఫిఫా నియమ నిబంధనల ప్రకారం ఇలాంటి ప్రజా పిటిషన్లకు ఎలాంటి చట్టపరమైన అర్హత లేదా అధికారిక విలువ ఉండదు. మైదానంలో రిఫరీల నిర్ణయాలే అంతిమమైనవి. సోషల్ మీడియాలో వచ్చే నిరసనలు, ఆన్‌లైన్ సంతకాల ఆధారంగా మ్యాచ్ ఫలితాలను మార్చడం లేదా ఒక జట్టును టోర్నమెంట్ నుండి తొలగించడం అసాధ్యమని క్రీడా విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.
అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోని సైతం ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. ప్రస్తుతం వీడియో అసిస్టెంట్ రిఫరీ లాంటి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న కాలంలో ఒక జట్టుకు పక్షపాతంగా వ్యవహరించడం సాధ్యం కాదు. మైదానంలో మా ఆటగాళ్లు చూపిన ప్రతిభ, కష్టం వల్లే మేము ఈరోజు ఫైనల్స్ చేరాము" అని ఆయన స్పష్టం చేశారు.
వివాదాలు ఎలా ఉన్నా, పిచ్‌పై అర్జెంటీనా ఆట తీరు మాత్రం ఫుట్‌బాల్ లవర్స్‌ను కట్టిపడేస్తోంది. మరి ఈ వివాదాలన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ అర్జెంటీనా మరోసారి వరల్డ్ కప్ నెగ్గుతుందా..? లేక స్పెయిన్ కొత్త చరిత్ర సృష్టిస్తుందా..? తెలియాలంటే జూలై 20 అర్ధరాత్రి వరకు ఆగాల్సిందే.




