Amit Mishra: తిండి పెట్టలేదు, కొట్టేవాడు, రోజూ వేధింపులే.. భారత మాజీ ఆటగాడిపై భార్య సంచలన ఆరోపణలు!

Amit Mishra: భారత మాజీ ఆటగాడు అమిత్ మిశ్రాపై అతని భార్య సంచలన ఆరోపణలు చేశారు. కాన్పూర్‌కు చెందిన 35 ఏళ్ల మోడల్ గరిమా తివారి తన భర్త అమిత్ మిశ్రాతో పాటు అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, దాడి, మాన‌సికంగా హింసించడం, ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు ఆరోపిస్తూ.. కాన్పూర్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు.

Rishvik
Published on: 10 March 2026 7:08 PM IST
Amit Mishra
X

Amit Mishra: తిండి పెట్టలేదు, కొట్టేవాడు, రోజూ వేధింపులే.. భారత మాజీ ఆటగాడిపై భార్య సంచలన ఆరోపణలు!

Amit Mishra: భారత మాజీ ఆటగాడు అమిత్ మిశ్రాపై అతని భార్య సంచలన ఆరోపణలు చేశారు. కాన్పూర్‌కు చెందిన 35 ఏళ్ల మోడల్ గరిమా తివారి తన భర్త అమిత్ మిశ్రాతో పాటు అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, దాడి, మాన‌సికంగా హింసించడం, ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు ఆరోపిస్తూ.. కాన్పూర్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. అదనపు సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులో ఈ ఫిర్యాదు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

గరిమా తివారి ఫిర్యాదులో అమిత్ మిశ్రాతో పాటు అతని తల్లి బీనా మిశ్రా, తండ్రి శశికాంత్ మిశ్రా, సోదరుడు అమర్ మిశ్రా, వదిన రితు మిశ్రా, సోదరి స్వాతి మిశ్రాలను సహ ఆరోపితులుగా పేర్కొన్నారు. వివాహం తర్వాత తనపై భర్తతో పాటు అత్తమామలు నిరంతరం శారీరక, మానసిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఇది అమిత్ మిశ్రాపై గరిమా దాఖలు చేసిన మూడో కేసు కావడం గమనార్హం. 2025 ఏప్రిల్ 21న గృహహింస కేసు నమోదు చేయగా.. రెండు రోజుల తర్వాత రూ.50 వేల నెలవారీ భరణం, రూ.1 కోటి పరిహారం కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు వరకట్న వేధింపుల కేసు పెట్టారు. ఈ కేసును త్వరలో కోర్టు ప్రాథమిక విచారణకు తీసుకునే అవకాశం ఉంది.

'నేను, అమిత్ మిశ్రా 2019లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాం. దాదాపు మూడు సంవత్సరాలు ప్రేమలో ఉన్న తర్వాత 2021 ఏప్రిల్ 26న కాన్పూర్ క్లబ్‌లో వివాహం చేసుకున్నాము. పెళ్లి తర్వాత నా కుటుంబంపై కట్నం కోసం ఒత్తిడి తెచ్చాడు. హోండా సిటీ కారు, రూ.10 లక్షలు కట్నంగా ఇవ్వాలని అమిత్ మిశ్రా కుటుంబం ఒత్తిడి తెచ్చింది. వివాహ సమయంలో నా కుటుంబం రూ.2.5 లక్షలు ఇచ్చింది. ఇంకా డబ్బు ఇవ్వాలని తరచూ వేధింపులకు గురిచేస్తున్నారు. మద్యం సేవించి అమిత్ మిశ్రా నాపై తరచూ దాడి చేసేవాదు. మానసికంగా వేధించాడు. కొన్ని సందర్భాల్లో రోజులు తరబడి తినడానికి కూడా ఏమి ఇవ్వకుండా వేధించాడు. నేను మోడలింగ్ ద్వారా సంపాదించిన డబ్బును కూడా నా భర్త తీసుకున్నాడు. తరచూ విడాకులు ఇస్తానని బెదిరించేవాడు. ఈ వేధింపుల వల్ల నేను తీవ్ర నిరాశకు గురై మోడలింగ్ కెరీర్‌ను కూడా వదిలేయాల్సి వచ్చింది. ఒకసారి ఫినైల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. ఈ విషయంలో పలుమార్లు పోలీసులకు, పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశాను. అమిత్ మిశ్రా ప్రభావం కారణంగా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. దీంతో చివరకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది' అని గరిమా తివారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Rishvik

Rishvik

Next Story