IPL 2026: విధ్వంసానికి 5గురు బుడ్డోళ్లు సిద్ధం.. లెక్కలు చూస్తే ఐపీఎల్ హిస్టరీ మారాల్సిందే?

IPL 2026 Uncapped Players: ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కాకముందే యువ ఆటగాళ్లపై అంచనాలు భారీగా పెరిగాయి.

Venkat
Published on: 27 March 2026 7:39 PM IST
From Vaibhav Suryavanshi to Ayush Mhatre these top 5 ipl 2026 uncapped players to watch out for
X

IPL 2026: విధ్వంసానికి 5గురు బుడ్డోళ్లు సిద్ధం.. లెక్కలు చూస్తే ఐపీఎల్ హిస్టరీ మారాల్సిందే?

IPL 2026 Uncapped Players: భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో యువ ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా, దేశవాళీ పోటీలలో రాణించి తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు ఈ లీగ్ ఒక సువర్ణావకాశం. 2026 సీజన్‌లో ముఖ్యంగా ఐదుగురు ఆటగాళ్లు తమ బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలతో ప్రత్యర్థి జట్లకు సవాల్ విసిరేందుకు సిద్ధంగా ఉన్నారు.

1. వైభవ్ సూర్యవంశీ: చిన్న వయసులోనే భారీ రికార్డులు..

అండర్-19 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడైన వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. గత సీజన్‌లో కేవలం 35 బంతుల్లోనే శతకం బాది, ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అరంగేట్రం చేసిన రెండో బంతికే సిక్సర్ కొట్టే తెగువ ఉన్న వైభవ్, ఈసారి కూడా అదే దూకుడును ప్రదర్శించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

2. ఆయుష్ మ్హాత్రే: చెన్నై సూపర్ కింగ్స్ ఆశాకిరణం..

అండర్-19 జట్టుకు సారథ్యం వహించిన ఆయుష్ మ్హాత్రేపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో చెన్నై జట్టు తరపున సంజూ శాంసన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆయుష్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

3. ఆకిబ్ నబీ: వికెట్ల వేటగాడు..

బౌలింగ్ విభాగంలో ఆకిబ్ నబీ ఒక ప్రమాదకర బౌలర్‌గా అవతరించాడు. గత రంజీ ట్రోఫీ సీజన్‌లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇతడిని వేలంలో దక్కించుకుంది. తన వేగవంతమైన బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేందుకు ఆకిబ్ సిద్ధమవుతున్నాడు. ఈ ప్రదర్శన అతడికి టీమ్ ఇండియా తలుపులు తెరిచే అవకాశం ఉంది.

4. కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్: వేలంలో కాసుల వర్షం..

చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం యువ ఆటగాళ్లపై చూపే నమ్మకం మరోసారి రుజువైంది. కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌ను చెరో 14.20 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది. కార్తీక్ శర్మ ధోనీ, శాంసన్ సమక్షంలో వికెట్ కీపింగ్ విభాగంలో అదనపు బలమే కాకుండా, భారీ హిట్టింగ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైయ్యాడు. మరోవైపు ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో అదరగొట్టిన ప్రశాంత్ వీర్, తన ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టుకు సమతూకాన్ని తీసుకురావాలని చూస్తున్నాడు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story