Gautam Gambhir: ఇలా అయితే ఎలా? ఆఫ్గ‌నిస్తాన్ టెస్ట్ సిరీస్‌పై గంభీర్ అసంతృప్తి!

Gautam Gambhir: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ ఓ విష‌యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Mokshith
Published on: 21 April 2026 2:28 PM IST
Gautam Gambhir
X

Gautam Gambhir: ఇలా అయితే ఎలా? ఆఫ్గ‌నిస్తాన్ టెస్ట్ సిరీస్‌పై గంభీర్ అసంతృప్తి!

Gautam Gambhir: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ ఓ విష‌యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనికి కార‌ణం బీసీసీఐ తీసుకున్న నిర్ణ‌య‌మే అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఏం జ‌రిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఐపీఎల్ వెంటనే టెస్ట్ మ్యాచ్

ఐపీఎల్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ మే 31న జరుగుతుంది. అయితే, ఆ తర్వాత కేవలం 6 రోజుల గ్యాప్‌తో జూన్ 6న భారత్-ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ తక్కువ విరామం వల్ల ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునే అవకాశం లేకుండా పోతుంది. ఇదే విషయంపై గంభీర్, గిల్ ముందే అభ్యంతరం వ్యక్తం చేసినట్టు రిపోర్టులు చెబుతున్నాయి.

సీనియర్ ప్లేయర్లకు రెస్ట్… కొత్తవారికి ఛాన్స్?

ఈ పరిస్థితుల్లో సెలక్షన్ కమిటీ (అజిత్ అగర్కర్ నేతృత్వంలో) ప్లాన్-B సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా బుమ్రా, కేఎల్ రాహుల్‌, ర‌వీంద్ర జ‌డేజా వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. అదే సమయంలో గర్నూర్ బ్రార్, మనవ్ సుతార్, ఆక్విబ్ నబీ, దేవదత్ పడిక్కల్ వంటి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వీరి ప్రదర్శన మంచి ఇంప్రెషన్ ఇచ్చింది.

డబ్ల్యూటీసీ పాయింట్లు లేని మ్యాచ్

భారత్-ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్‌కు వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ పాయింట్లు లేవు. కాబట్టి ఈ మ్యాచ్‌కు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని సెలెక్టర్లు భావిస్తున్నారు. ముందుగా ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్, అలాగే శ్రీలంక, న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లు ఉండటంతో ప్రధాన ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను కాపాడటం ముఖ్యంగా మారింది.

షెడ్యూల్ వల్ల ఫార్మాట్ మార్పులు… ఆటగాళ్లపై ఒత్తిడి

ఐపీఎల్ (టీ20) నుంచి నేరుగా టెస్ట్, తర్వాత వన్డే ఫార్మాట్‌లోకి మారాల్సి రావడం ఆటగాళ్లకు పెద్ద సవాలుగా మార‌నుంది. గిల్, బుమ్రా, రాహుల్ వంటి ఆటగాళ్లు ఒక నెలలో మూడు ఫార్మాట్లు ఆడాల్సి వచ్చే పరిస్థితి ఉంది.

ఈ కారణంగా గంభీర్, గిల్ గతంలోనే ఇలాంటి షెడ్యూల్‌లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరికి ఈ మ్యాచ్‌కు తుది నిర్ణయం కోచ్, కెప్టెన్ అభిప్రాయాల ఆధారంగా ఉండే అవకాశం ఉంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story