GT vs RR Qualifier 2: ఫైనల్ బెర్త్ కోసం మహా సమరం.. పిచ్, ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్ రికార్డ్స్.. వైభవ్‌ను ఆపేది ఎవరు?
GT vs RR Qualifier 2 IPL 2026 Preview: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఫైనల్‌కు చేరుకునే చివరి అడుగులో గుజరాత్ టైటాన్స్ (జీటీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు తలపడబోతున్నాయి.
GT vs RR Qualifier 2: ఫైనల్ బెర్త్ కోసం మహా సమరం.. పిచ్, ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్ రికార్డ్స్.. వైభవ్‌ను ఆపేది ఎవరు?
GT vs RR Qualifier 2: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఫైనల్‌కు చేరుకునే చివరి అడుగులో గుజరాత్ టైటాన్స్ (జీటీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు తలపడబోతున్నాయి. శుక్రవారం న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జీటీ vs ఆర్ఆర్ ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్ రికార్డ్స్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
వైభవ్‌ను ఆపేది ఎవరు?:
క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఫామ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి అందరినీ షాక్‌కు గురిచేశాడు. 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో చెలరేగిన బుడ్డోడు.. క్రిస్ గేల్ పేరిట ఉన్న ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వైభవ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ 243 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. ఇప్పుడు గుజరాత్ బౌలర్ల ముందు ప్రధాన సవాలు ఒక్కటే.. అదే వైభవ్‌ను త్వరగా ఔట్ చేయడం. కగిసో రబాడ, రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్ కలిసి బుడ్డోడిని ఆపడం పైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
హెడ్ టు హెడ్ రికార్డు:
హెడ్ టు హెడ్ రికార్డుల్లో గుజరాత్ టైటాన్స్ ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 10 సార్లు తలపడగా.. గుజరాత్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రాజస్థాన్ కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. అయితే ప్రస్తుతం రాజస్థాన్ ఫామ్ చూస్తుంటే.. గత గణాంకాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. వైభవ్, జైస్వాల్, ధృవ్ జురెల్ వంటి బ్యాటర్లు అద్భుత ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు.
పిచ్ రిపోర్ట్:
ముల్లాన్‌పూర్ పిచ్ ఈ సీజన్ మొత్తం బ్యాటర్లకు అనుకూలంగా ఉంది. మంచి బౌన్స్, వేగం ఉండటంతో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఇక్కడ పవర్‌ప్లేలో బౌండరీలు సులభంగా వస్తున్నాయి. అయితే ప్రారంభ ఓవర్లలో పేసర్లకు కొంత సహకారం కూడా ఉంటుంది. జోఫ్రా ఆర్చర్ లాంటి ఫాస్ట్ బౌలర్ రిథమ్‌లోకి వస్తే ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టాలు తప్పవు. మరోవైపు గుజరాత్ జట్టుకు రషీద్ ఖాన్, రబాడ, సిరాజ్ వంటి నాణ్యమైన బౌలింగ్ దళం ఉంది. అందుకే ఈ మ్యాచ్‌లో తొలి ఆరు ఓవర్లు కీలకంగా మారనున్నాయి.
లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్:
భారత అభిమానులు ఈ మ్యాచ్‌ను జియోహాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు. టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, నిషాంత్ సింధు, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తేవాటియా, రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరెరా, దసున్ షనాకా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.




