Gurnoor Brar: 6.5 అడుగుల పేసర్‌కు భారత జట్టులో చోటు.. ఎవరీ గుర్నూర్ బ్రార్?
Gurnoor Brar: ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు భారత జట్టులో యువ పేసర్ గుర్నూర్ బ్రార్ చోటు దక్కించుకున్నాడు.
Gurnoor Brar: 6.5 అడుగుల పేసర్‌కు భారత జట్టులో చోటు.. ఎవరీ గుర్నూర్ బ్రార్?
Gurnoor Brar: ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం జట్టును ప్రకటించింది. భారత జట్టులో యువ పేసర్ గుర్నూర్ బ్రార్ చోటు దక్కించుకున్నాడు. మొదటిసారి టీమిండియాకు ఎంపికైన గుర్నూర్ బ్రార్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న ఈ పంజాబ్ ఫాస్ట్ బౌలర్.. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్నాడు. అయితే అతడు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ దేశీయ క్రికెట్‌లో అతడు చూపించిన నిలకడైన ప్రదర్శనే భారత జట్టులో చోటు దక్కడానికి ప్రధాన కారణమైంది.
2022లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్.. 2024-25 సీజన్‌లో అసలు సిసఅద్భుతమైన ప్రతిభను కనబర్చాడు. ఆ సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. మొత్తం 12 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు తీసిన గుర్నూర్.. 3.43 ఎకానమీతో అద్భుత బౌలింగ్ గణాంకాలు ప్రదర్శించాడు. షేర్-ఏ-పంజాబ్ టీ20 లీగ్‌లో కూడా 11 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
ఐపీఎల్ ప్రయాణంలో కూడా గుర్నూర్ బ్రార్ ఆసక్తికరమైన ప్రస్థానం కొనసాగించాడు. 2019లో ముంబై ఇండియన్స్‌కు నెట్ బౌలర్‌గా పని చేసిన అతడు.. 2023లో పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. దేశీయ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కారణంగా 2025 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ.1.3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇటీవల ఇండియా-ఏ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించిన గుర్నూర్.. తన వేగం, బౌన్స్‌తో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు.
భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో గుర్నూర్ బ్రార్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ విషయాన్ని గుర్నూర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘అండర్-19 రోజుల నుంచే నేను శుభ్‌మన్ గిల్‌కు బౌలింగ్ చేసేవాడిని. ఇండియా అండర్-19 తరఫున ఆడుతున్న సమయంలో అతడు కటోచ్ షీల్డ్ మ్యాచ్‌లు ఆడాడు. అప్పుడు నా బౌలింగ్ చూసి జిల్లా జట్టులో అవకాశం రావడానికి సహాయం చేశాడు. తర్వాత మొహాలీ జట్టుకు ఎంపికయ్యాను. అక్కడి నుంచి పంజాబ్ అండర్-23 జట్టులో చోటు దక్కింది’ అని తెలిపాడు. ఇప్పుడు భారత జట్టులో చోటు దక్కడంతో గుర్నూర్ బ్రార్‌పై అందరి దృష్టి పడింది.




