Rohit Sharma Injury Update: ముంబైకి భారీ షాక్.. మరిన్ని మ్యాచ్‌లకు రోహిత్ శర్మ దూరం.. క్లారిటీ ఇచ్చేసిన హార్దిక్!

Rohit Sharma Injury Update: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య రోహిత్ శర్మ గాయంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. హిట్‌మ్యాన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలిపాడు.

Rishvik
Published on: 16 April 2026 10:08 PM IST
Hardik Pandya Confirms Rohit Sharma to Miss More IPL 2026 Matches
X

Rohit Sharma Injury Update: ముంబైకి భారీ షాక్.. మరిన్ని మ్యాచ్‌లకు రోహిత్ శర్మ దూరం.. క్లారిటీ ఇచ్చేసిన హార్దిక్!

Rohit Sharma Injury Update: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ (ఎంఐ)కు గాయాల సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో జట్టుకు దూరమవడం పెద్ద ఎదురు దెబ్బగా మారింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య రోహిత్ గాయంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. హిట్‌మ్యాన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలిపాడు. రోహిత్ తిరిగి జట్టులోకి రావడానికి ఇంకొన్ని మ్యాచ్‌లు పట్టనుందని హార్దిక్ వెల్లడించాడు.

పంజాబ్ కింగ్స్‌తో టాస్ సందర్భంగా హార్దిక్ పాండ్య మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ ఇప్పటికే గత మ్యాచ్‌ నుంచి దూరమయ్యాడు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. తిరిగి జట్టులోకి రావడానికి ఇంకొన్ని మ్యాచ్‌లు పట్టే అవకాశం ఉంది' అని చెప్పాడు. ముంబై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇలాంటి కీలక సమయంలో రోహిత్ దూరమవడం జట్టుకు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్‌కు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ అనారోగ్యంతో దూరమయ్యాడు. దాంతో జట్టులో రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. హిట్‌మ్యాన్ స్థానంలో క్వింటన్ డి కాక్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. యువ ఆటగాడు మయాంక్ రావత్ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.

ఏప్రిల్ 12న ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ రోహిత్ శర్మ హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఆ మ్యాచ్‌లో 19 పరుగులు చేసిన తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాల్సి వచ్చింది. అప్పటి నుంచి హిట్‌మ్యాన్ పూర్తిగా కోలుకోలేకపోయాడు. అతడికి పెద్ద గాయమేమీ కాలేదని ముంబై వైద్య బృందం స్పష్టం చేసింది. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ముంబై ఆడే తదుపరి 2-3 మ్యాచులకు హిట్‌మ్యాన్ దూరం కానున్నాడు. రోహిత్ ఈ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. కోల్‌కతాపై 83 పరుగులతో మెరిశాడు. అయితే తర్వాతి మూడు మ్యాచ్‌లలో ఆ ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో 137 పరుగులు చేసి.. ఇప్పటికీ ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. వరుసగా మూడు పరాజయాలతో ముంబై వెనకపడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన ఎంఐ.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో పంజాబ్ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story