Hardik Pandya: పాండ్యా సర్ప్రైజ్.. గర్ల్‌ఫ్రెండ్‌కు లగ్జరీ గిఫ్ట్!

Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి తన అమితమైన ప్రేమను చాటుకున్నాడు.

Rishvik
Published on: 30 March 2026 7:06 PM IST
Hardik Pandya
X

Hardik Pandya: పాండ్యా సర్ప్రైజ్.. గర్ల్‌ఫ్రెండ్‌కు లగ్జరీ గిఫ్ట్!

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి తన అమితమైన ప్రేమను చాటుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ మహికా శర్మకు ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ.. భారత్‌లో తాజాగా లాంచ్ అయిన మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ కార్ ధర సుమారు రూ.1.7 కోట్ల వరకు ఉండటం విశేషం. ఆన్-ఫీల్డ్ విజయాల వెనుక మహికా ప్రోత్సాహం ఎంతో ఉందని పలు సందర్భాల్లో చెప్పిన హార్దిక్.. తన ప్రేమను ఇలా వినూత్నంగా చాటుకున్నాడు. ఈ బహుమతికి మహికా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొద్ది వారాల క్రితమే హార్దిక్ పాండ్యా తన కోసం రూ.12 కోట్ల విలువైన అల్ట్రా లగ్జరీ ఫెరారీ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రియురాలికి ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చాడు. మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మోడల్‌ను ఇండియాలో కొనుగోలు చేసిన మొట్టమొదటి వ్యక్తి మహికానే కావడం విశేషం. అత్యంత విశాలంగా, అత్యాఆధునికంగా ఉండే ఈ కారుతో హార్దిక్, మహికా కలిసి ఫొటోస్ దిగారు. దాంతో సోషల్ మీడియాలో ఈ జంట హాట్ టాపిక్‌గా మారింది. కార్‌తో కలిసి దిగిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. హార్దిక్ ఇటీవలే రూ.2 కోట్ల వాచ్ కూడా కొన్నాడు. దాంతో ఈ మధ్యనే హార్దిక్ కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు.

మైదానంలో కూడా హార్దిక్ పాండ్యా సత్తా చాటుతున్నాడు. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026లో శుభారంభం చేసింది. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 19.1 ఓవర్లలోనే 224/4తో ఛేజ్ చేసి గెలుపొందింది.

ముంబై విజయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (78), ర్యాన్ రికెల్టన్ (81) అర్ధ శతకాలు బాదారు. మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ.. '13 ఏళ్లుగా ఓపెనింగ్ మ్యాచ్‌లో గెలవాలని ఎదురుచూస్తున్నాం. ప్రతి సారి మంచి ఆరంభం కావాలని ఆశించాం. చివరకు ఈసారి సాధించగలిగాం. జట్టు మొత్తం చాలా సంతోషంగా ఉంది' అని తెలిపాడు. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ప్రేమతో సర్ప్రైజ్ ఇస్తూ.. మరోవైపు మైదానంలో జట్టుకు విజయాలు అందిస్తూ హార్దిక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.



Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story