IPL: 5 టైటిళ్ల హార్దిక్ పాండ్యా పంజాబ్ కరవు తీరుస్తాడా.? టైటిల్ లేని జట్టులో చేరిన ఛాంపియన్ ఆల్‌రౌండర్!

IPL: ఐపీఎల్‌లో ఐదు టైటిళ్లు గెలిచిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు రూ. 18 కోట్లతో పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ అవగా, ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని ఆ జట్టు కరవును ఆయన తీరుస్తారేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Ravi
By Ravi
Published on: 11 Nov 2026 3:17 PM IST
IPL
X

IPL: 5 టైటిళ్ల హార్దిక్ పాండ్యా పంజాబ్ కరవు తీరుస్తాడా.? టైటిల్ లేని జట్టులో చేరిన ఛాంపియన్ ఆల్‌రౌండర్!

IPL: IPLలో మోస్ట్ టైటిల్ విన్నింగ్ ప్లేయర్లలో హార్దిక్ పాండ్యా ఒకరు. IPL-2015లో డెబ్యూ చేసిన ఆయన ఆ ఏడాదితో పాటు 2017, 19, 20 సీజన్లలో కప్పు గెలిచిన ముంబై జట్టులో కీలక ప్లేయర్‌గా రాణించారు. 2022లో GT జట్టుకు కెప్టెన్‌గా వెళ్లి కప్ అందించారు. 2023లోనూ GTని ఫైనల్‌కు చేర్చారు. 2024లో తిరిగి MI గూటికి చేరి కెప్టెన్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ పంజాబ్‌కు వెళ్తున్న హార్దిక్ ఆ జట్టు టైటిల్ కరవు తీరుస్తారేమో చూడాలి. ఈ ట్రేడ్‌ను ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం ధ్రువీకరించారు. హార్దిక్ రూ. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్‌లో చేరారు. ముంబై ఆయనకు ఇస్తున్న రూ. 16.35 కోట్ల కంటే ఇది ఎక్కువ. బదులుగా ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబైకి వెళ్లారు. అర్ష్‌దీప్ ఫీజు కూడా రూ. 18 కోట్లు.

2022లో గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్‌లోనే టైటిల్ గెలవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించారు. ఆ ఫైనల్‌లో 3 వికెట్లు తీసి, 34 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యారు. రాజస్థాన్ రాయల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించారు. కెప్టెన్‌గా ఆయన గుజరాత్‌కు ఆడిన 31 మ్యాచుల్లో 22 గెలిపించారు. అయితే ముంబై కెప్టెన్‌గా 39 మ్యాచుల్లో 15 మాత్రమే గెలిచారు. ముంబైలో రెండో దశ ఆయనకు కష్టంగా సాగింది. 2024లో ముంబై లీగ్ స్టేజ్‌లో చివరి స్థానంలో నిలిచింది. 2025లో క్వాలిఫయర్ 2 వరకు వెళ్లింది. అక్కడ పంజాబ్ చేతిలో ఓడింది. 2026లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2025లో వ్యక్తిగతంగా హార్దిక్ 224 పరుగులు 163.50 స్ట్రైక్ రేట్‌తో చేసి, 14 వికెట్లు తీశారు. మూడు సీజన్ల కెప్టెన్సీలోనూ ముంబైకి టైటిల్ రాలేదు.

పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో, 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఫైనల్‌లో ఓడింది. హార్దిక్ పంజాబ్‌లో కెప్టెన్ కాదు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా కొనసాగుతారు. ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన అనుభవం ఉన్న ఆల్‌రౌండర్ రాకతో ఆ జట్టు తొలి ట్రోఫీ కల నెరవేరుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.