Hardik Pandya : హార్దిక్ పాండ్యా రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ? .. అసలు ఎవరీ మహికా శర్మ?

Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మే 22న మహికా శర్మను రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది.

CR Reddy
Published on: 16 May 2026 6:31 AM IST
Hardik Pandya
X

Hardik Pandya

Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈసారి ఆటతో కాదు, తన వ్యక్తిగత జీవితం, రెండో పెళ్లి వార్తలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న తరుణంలో, హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. గత కొన్ని మ్యాచులుగా హార్దిక్ జట్టుతో ప్రయాణించకపోవడం, మైదానంలో కనిపించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అసలే ఫామ్‌లో లేక సతమతమవుతున్న పాండ్యాకు, ఇప్పుడు ఈ పెళ్లి వార్తలు కొత్త తలనొప్పిగా మారాయి.

ఎవరీ మహికా శర్మ? పెళ్లి ఎప్పుడు?

హార్దిక్ పాండ్యా తన మొదటి భార్య నటాషా స్టాంకోవిచ్‌తో 2024 జూలైలో అధికారికంగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లుగా ఆయన మహికా శర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా వైరల్ అవుతున్న పోస్ట్‌ల ప్రకారం.. వీరిద్దరూ మే 22న వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. మహికా శర్మ ముంబై ఇండియన్స్ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ స్టేడియంలో కనిపిస్తూ హార్దిక్‌ను ఉత్సాహపరుస్తూ ఉండటంతో వీరి మధ్య బంధం బలపడిందని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంపై అటు హార్దిక్ కానీ, ఇటు ముంబై మేనేజ్‌మెంట్ కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

బీసీసీఐ రూల్స్.. పెళ్లికి కారణం ఇదేనా?

ఈ ఆకస్మిక పెళ్లి నిర్ణయం వెనుక ఒక షాకింగ్ కారణం ఉందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. స్టేడియంలో మ్యాచ్ ముగియగానే హార్దిక్ టీమ్ మీటింగ్స్ వదిలేసి మహికా దగ్గరికి వెళ్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోని రహస్యాలను మహికా లీక్ చేస్తున్నారనే విమర్శలు రావడంతో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. గర్ల్‌ఫ్రెండ్స్‌ను టీమ్ క్యాంప్‌లోకి తీసుకురావద్దని నిబంధన పెట్టడంతో, ఆ అడ్డంకిని తొలగించుకోవడానికే హార్దిక్ ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారని నెటిజన్లు వాదిస్తున్నారు. ఈ వివాదం కారణంగానే హార్దిక్ గత కొన్ని మ్యాచులకు దూరంగా ఉన్నారనే వాదన కూడా వినిపిస్తోంది.

కెప్టెన్‌గా విఫలం.. ముంబై పరిస్థితి ఘోరం

వ్యక్తిగత జీవితం ఇలా ఉంటే, మైదానంలోనూ హార్దిక్ పాండ్యాకు కాలం కలిసిరావడం లేదు. రోహిత్ శర్మను కాదని ముంబై పగ్గాలు చేపట్టిన హార్దిక్, ఈ సీజన్‌లో కెప్టెన్‌గా పూర్తిగా విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ ఆడిన 8 మ్యాచులలో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. హార్దిక్ వ్యక్తిగత ప్రదర్శన చూస్తే.. 8 మ్యాచుల్లో కేవలం 107 పరుగులు చేసి, 4 వికెట్లు మాత్రమే తీశారు. అటు ఫ్యాన్స్ నుంచి వస్తున్న ట్రోలింగ్, ఇటు జట్టు పేలవ ప్రదర్శన మధ్య హార్దిక్ రెండో పెళ్లి వార్త ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story