Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ బిగ్ షాక్..!
Hardik Pandya: IPL 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యంపై యాజమాన్యం సీరియస్ అయింది.
Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ బిగ్ షాక్..!
Mumbai Indians: ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన బలమైన ముంబై ఇండియన్స్ సామ్రాజ్యంలో ఇప్పుడు తీవ్ర అలజడి రేగుతోంది. ఒకప్పుడు పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండే ముంబై, ఐపీఎల్ 2026 సీజన్‌లో 9వ స్థానానికి పడిపోవడాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. జాతీయ మీడియాలో వస్తున్న తాజా కథనాల ప్రకారం.. ముంబై ఇండియన్స్ కోర్ టీమ్‌లో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోంది. ఇందులో భాగంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై కెప్టెన్సీ వేటు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
రోహిత్ శర్మ వంటి సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌ను పక్కన పెట్టి, భారీ అంచనాలతో హార్దిక్ పాండ్యాకు ముంబై పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే గత రెండు సీజన్లుగా ఈ నిర్ణయం జట్టుకు ఏమాత్రం కలిసిరాలేదు.మైదానంలో ఆశించిన విజయాలు దక్కలేదు.ఆటగాళ్ల మధ్య కెమిస్ట్రీ దెబ్బతిన్నట్లు స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియా నుండి స్టేడియం వరకు అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. వీటన్నింటికీ తోడు ఈ సీజన్ ఘోర వైఫల్యం యాజమాన్యానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ముంబై ఇండియన్స్ అంతర్గత సమీక్షలో కేవలం హార్దిక్ కెప్టెన్సీని మార్చడం మాత్రమే కాకుండా, అంతకంటే పెద్ద నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుండి తొలగించడమే కాకుండా, రాబోయే సీజన్ల కోసం అతడిని జట్టులోనే ఉంచాలా లేక వేరే టీమ్‌కు ట్రేడ్ చేయాలా అనే కోణంలో యాజమాన్యం ఆలోచిస్తోంది. ప్రణాళికలను మైదానంలో సరిగ్గా అమలు చేయని మరికొంతమంది సీనియర్, జూనియర్ ఆటగాళ్లపై కూడా కోచింగ్ బృందం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆ ఆటగాళ్లకు కూడా త్వరలోనే గుడ్ బై చెప్పనున్నారు.
రాబోయే ఐపీఎల్ వేలాన్ని దృష్టిలో ఉంచుకుని ముంబై సరికొత్త కోర్ టీమ్‌ను నిర్మించాలని భావిస్తోంది. ముంబై ఇండియన్స్ భవిష్యత్తు ప్రణాళికలపై, కొత్త కెప్టెన్ ఎవరనే అంశంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మళ్లీ రోహిత్ శర్మకు పగ్గాలు ఇస్తారా? లేక సూర్యకుమార్ యాదవ్, బుమ్రా వంటి సీనియర్లకు అవకాశం దక్కుతుందా? లేక వేలంలో సరికొత్త లీడర్‌ను వెతుక్కుంటారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మొత్తానికైతే, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు రాబోయే రోజుల్లో ఒక భారీ సినిమాటిక్ ట్విస్ట్ లాంటి అప్‌డేట్ రాబోతోందన్నమాట.




