Hardik Pandya: హార్దిక్ సంచలన నిర్ణయం.. ముంబైకి గుడ్‌బై, ఇకనుంచి బెంగళూరులోనే!
Hardik Pandya: హార్దిక్ పాండ్య తన క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Hardik Pandya: హార్దిక్ సంచలన నిర్ణయం.. ముంబైకి గుడ్‌బై, ఇకనుంచి బెంగళూరులోనే!
Hardik Pandya: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబైని వీడి బెంగళూరుకు శాశ్వతంగా మకాం మార్చినట్లు సమాచారం. ఇకపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)నే తన ప్రధాన శిక్షణ కేంద్రంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. భారత జట్టులో ప్రస్తుతం ఆడుతున్న ప్రముఖ క్రికెటర్‌లలో ఇలా సీఓఈని శాశ్వత ట్రైనింగ్ బేస్‌గా ఎంచుకున్న తొలి ఆటగాడిగా హార్దిక్ నిలవనున్నాడు.
సాధారణంగా బీసీసీఐతో ఒప్పందం ఉన్న ప్లేయర్స్ గాయాల నుంచి కోలుకోవడానికి, ఫిట్‌నెస్ పరీక్షలు లేదా జాతీయ శిక్షణ శిబిరాల కోసం మాత్రమే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సందర్శిస్తుంటారు. అయితే హార్దిక్ పాండ్య మాత్రం ఇకపై సీఓఈని తన ప్రధాన శిక్షణ వేదికగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకునట్లు సమాచారం.
గుజరాత్‌లోని వడోదరకు చెందిన హార్దిక్ గత దశాబ్ద కాలంగా ముంబైలోనే నివసిస్తున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు చెందిన ఘన్సోలీ శిక్షణ కేంద్రంలో ఎక్కువగా సాధన చేసేవాడు. అయితే ప్రస్తుతం క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా చికిత్స పొందుతున్న హార్దిక్.. గత ఆరు నెలలుగా బెంగళూరులోని సీఓఈలో ఎక్కువ సమయం గడుపుతున్నాడు.
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం... బెంగళూరు శివార్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సమీపంలో హార్దిక్ పాండ్య ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ముంబైలోని లోయర్ పరేల్ నివాసం నుంచి ప్రతిరోజూ శిక్షణకు వెళ్లడం ఇబ్బందిగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఒప్పందం ఉన్న ఆటగాడిగా సీఓఈలో అందుబాటులో ఉన్న గాయాల నిర్వహణ, ఫిట్‌నెస్, నైపుణ్యాభివృద్ధి వంటి అన్ని సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నదే అతడి లక్ష్యంగా సమాచారం.
హార్దిక్ పాండ్య వ్యక్తిగత ఫిజియోథెరపిస్టుతో పాటు ప్రత్యేక స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌ను కూడా నియమించుకున్నట్లు తెలుస్తోంది. సీఓఈ వెలుపల కూడా తన ఫిట్‌నెస్ కార్యక్రమాలను క్రమం తప్పకుండా కొనసాగించేందుకు ఈ బృందం సహకరించనుంది. నెట్ బౌలర్లతో బ్యాటింగ్ సాధన చేసినప్పుడు వారికి పారితోషికాన్ని కూడా హార్దిక్ స్వయంగా చెల్లిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హార్దిక్ పునరావాస ప్రక్రియ కొనసాగుతోంది. వ్యక్తిగత పనుల నిమిత్తం కొన్ని రోజుల విరామం తీసుకున్న అతడు మరో ఒకటి లేదా రెండు రోజుల్లో తిరిగి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చేరనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తిచేసి 'రిటర్న్ టు ప్లే' ప్రోటోకాల్‌ను విజయవంతంగా పూర్తి చేస్తేనే.. యూకే పర్యటన అనంతరం జరిగే జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే ఐదు నుంచి ఆరు సంవత్సరాల పాటు భారత జట్టుకు వైట్‌బాల్ క్రికెట్‌లో సేవలు అందించాలన్న లక్ష్యంతో హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.




