INDW vs PAKW: టాస్ ఓడిన భారత్.. హర్మన్‌ప్రీత్ ఖాతాలో సరికొత్త మైలురాయి..!
INDW vs PAKW: మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ నంబర్ 9లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి.
INDW vs PAKW: టాస్ ఓడిన భారత్.. హర్మన్‌ప్రీత్ ఖాతాలో సరికొత్త మైలురాయి..!
Harmanpreet Kaur: మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ నంబర్ 9లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ పోరులో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌ను ఛేజింగ్‌కు ఆహ్వానించిన ఈ మ్యాచ్ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఒక మైలురాయిగా నిలిచింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక జట్టుకు ఏకంగా 150 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
కెప్టెన్సీ జాబితాలో అగ్రస్థానం..
మహిళల టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్ 150 మ్యాచ్‌లతో మొదటి స్థానంలో ఉంది. ఆమె తర్వాత శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు (121 మ్యాచ్‌లు), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ (100 మ్యాచ్‌లు), ఇంగ్లండ్ సారథి హీథర్ నైట్ (96 మ్యాచ్‌లు), రువాండా కెప్టెన్ డయాన్ బిమెనియిమానా (96 మ్యాచ్‌లు) కొనసాగుతున్నారు.
ఇరు జట్ల వివరాలు:
భారత్ (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, నందని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మునీబా అలీ (వికెట్ కీపర్), షావాల్ జుల్ఫీకర్, గుల్ ఫిరోజా, అయేషా జాఫర్, సదాఫ్ షామ్స్, ఫాతిమా సనా (కెప్టెన్), ఉమ్మె హని, ఐమాన్ ఫాతిమా, తుబా హసన్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్.




