Harmanpreet Kaur: జింబాబ్వేపై క్లీన్‌స్వీప్.. ఫామ్‌లోకి వచ్చి ఇంటర్వ్యూలోనే కన్నీళ్లు పెట్టుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్!
Harmanpreet Kaur: జింబాబ్వేతో టీ20 సిరీస్ విజయం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగానికి గురైంది.
Harmanpreet Kaur: జింబాబ్వేపై క్లీన్‌స్వీప్.. ఫామ్‌లోకి వచ్చి ఇంటర్వ్యూలోనే కన్నీళ్లు పెట్టుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్!
Harmanpreet Kaur: జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళా క్రికెట్ జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. చివరి మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును దక్కించుకుంది. భారత జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత హర్మన్‌కు దక్కిన తొలి అవార్డు ఇదే కావడం విశేషం. గడిచిన కొద్దికాలంగా పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆమె, ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లోనే నాటౌట్‌గా 91 పరుగులు చేసి తిరుగులేని పునరాగమనం చాటుకుంది.
అయితే, మ్యాచ్ అనంతరం మాట్లాడే సమయంలో హర్మన్‌ప్రీత్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. "నాపై ఇప్పుడు ఎలాంటి ఒత్తిడీ లేదు. మైదానంలోకి వెళ్లి ప్రతి క్షణాన్ని ఆస్వాదించడమే నా ముందున్న లక్ష్యం. ఇవాళ బ్యాటింగ్‌ను ఎంతగానో ఎంజాయ్ చేశాను. మైదానంలో రెండో బంతిని బౌండరీ తరలించగానే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందనే నమ్మకం వచ్చింది" అని తెలిపింది.
తన ఫామ్ పునరుద్ధరణకు బ్యాటింగ్ కోచ్ హిమాన్షు ఇచ్చిన సలహాలే కారణమని స్పష్టం చేసింది. "నా బ్యాటింగ్ శైలిపై కోచ్ హిమాన్షుకు స్పష్టమైన అవగాహన ఉంది. నెట్స్ శిక్షణ సమయంలో మ్యాచ్ ఒత్తిడిని సృష్టించి నా చేత షాట్ సెలెక్షన్ ప్రాక్టీస్ చేయించేవారు. ఆ వ్యూహాలే నాకు ఈరోజు బాగా ఉపయోగపడ్డాయి" అని చెప్పిన హర్మన్, మాట్లాడుతుండగానే కళ్లు చెమర్చడంతో మాటలు రాక ఇంటర్వ్యూ మధ్యలోనే పక్కకు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




