Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత.. టీమిండియా క్రికెట్ చరిత్రలోనే తొలి కెప్టెన్!
Harmanpreet Kaur scripted history at Lord's. ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి భారత మహిళల కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డుల్లో నిలిచింది.
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత.. టీమిండియా క్రికెట్ చరిత్రలోనే తొలి కెప్టెన్!
Harmanpreet Kaur: భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. క్రికెట్‌కు పుట్టినిల్లుగా పేరొందిన లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 270 పరుగుల భారీ తేడాతో ఓడించి కొత్త చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత్ సాధించిన ఈ విజయం భారత మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనతను అందుకుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి భారత మహిళల కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డుల్లో నిలిచింది.
తాజా విజయంతో లార్డ్స్‌లో టెస్టు క్రికెట్‌లో భారత్ విజయాల జాబితాలో మరో చారిత్రక అధ్యాయం చేరింది. ఇంతకుముందు భారత పురుషుల జట్టు 1986లో కపిల్ దేవ్ సారథ్యంలో 5 వికెట్ల తేడాతో గెలిచింది. 2014లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 95 పరుగుల తేడాతో గెలవగా.. 2021లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 151 పరుగుల తేడాతో లార్డ్స్‌లో టెస్టులు గెలిచింది. ఇప్పుడు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని మహిళల జట్టు 270 పరుగుల భారీ విజయంతో ఆ అరుదైన జాబితాలో తన పేరును నమోదు చేసింది. ఇప్పటివరకు భారత పురుష, మహిళా కెప్టెన్సీ నలుగురు మాత్రమే లార్డ్స్‌లో టెస్టులు గెలిచారు.
ఇక మహిళల టెస్టు క్రికెట్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య ఇప్పటివరకు 16 టెస్టులు జరిగాయి. వీటిలో భారత్ నాలుగు మ్యాచ్‌లు గెలవగా.. ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఆ విజయం కూడా 1995లో జంషెడ్‌పూర్లో నమోదైంది. ఇరు జట్ల మధ్య మిగిలిన 11 టెస్టులు డ్రాగా ముగిశాయి. దీంతో మహిళల టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై భారత్ తన ఆధిపత్యాన్ని మరోసారి కొనసాగించింది. ఇటీవలి కాలంలో టెస్టుల్లో భారత మహిళలు అద్భుత విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో లార్డ్స్‌లో నమోదైన ఈ చారిత్రక విజయం భారత మహిళల క్రికెట్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మైదానంలో ఇలాంటి ఘన విజయం సాధించడం భారత మహిళల జట్టుకు చిరస్మరణీయ మైలురాయిగా నిలిచిపోనుంది.
భారత్ నిర్దేశించిన 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే ఆలౌటైంది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే భారత బౌలర్లు మిగిలిన నాలుగు వికెట్లను పడగొట్టి.. మ్యాచ్‌ను ముగించారు. తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బౌలర్ల దాటికి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌ను 341/7 వద్ద డిక్లేర్ చేసింది. తోలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టి ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ ఇంగ్లండ్‌కు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. ఈ విజయంతో టీమిండియా క్రికెటర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఫాన్స్ కూడా సెలెబ్రేషన్స్ చేస్తున్నారు.




