10 ఫోర్లు, 6 సిక్సర్లు.. 42 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్..!
Harry Brook Century: శ్రీలంకతో మొదలైన టీ20 సిరీస్ తొలి పోరులోనే ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
10 ఫోర్లు, 6 సిక్సర్లు.. 42 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్..!
Harry Brook Century: సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ (Rose Bowl) మైదానంలో శ్రీలంక క్రికెట్ జట్టు (Sri Lanka Cricket Team)తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు (England Cricket Team) కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) పరుగుల విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తరఫున మూడో స్థానంలో క్రీజులోకి వచ్చిన బ్రూక్, లంక బౌలర్లను నిర్దాక్షిణ్యంగా శిక్షించారు.
కేవలం 42 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న ఆయన, మొత్తంగా 49 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 114 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. కెప్టెన్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆతిథ్య జట్టు నిర్ణీత ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లను ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేయడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఈ మెరుపు ఇన్నింగ్స్ బ్రూక్ ఖాతాలో ఎన్నో చారిత్రక రికార్డులను చేర్చింది. సౌతాంప్టన్ వేదికపై అత్యంత వేగంగా శతకం సాధించిన ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు. 2013లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఆరోన్ ఫించ్ (Aaron Finch) 47 బంతుల్లో నమోదు చేసిన రికార్డును బ్రూక్ బద్దలు కొట్టారు.
శ్రీలంకపై అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీల జాబితాలో రోహిత్ శర్మ (Rohit Sharma) 35 బంతుల రికార్డు తర్వాత బ్రూక్ రెండో స్థానంలో నిలిచారు. ఇంగ్లండ్ తరఫున వేగవంతమైన శతకాల విభాగంలో కూడా లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone) సరసన నిలిచి మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.
మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా రెండు శతకాలు సాధించిన పూర్తి స్థాయి సభ్య దేశాల కెప్టెన్లలో బాబర్ ఆజమ్ (Babar Azam), రోహిత్ శర్మ తర్వాత బ్రూక్ రెండో స్థానానికి చేరుకున్నారు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో 79*, 95*, 114* పరుగులతో వరుసగా యాభైకి పైగా స్కోర్లు సాధించి జాసన్ రాయ్ (Jason Roy), జోస్ బట్లర్ (Jos Buttler) సరసన నిలిచారు.
ఒక క్యాలెండర్ ఇయర్ పరిధిలో రెండు టీ20 సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా ఫహీమ్ నజీర్ (Faheem Nazir), ఆదిల్ భట్ (Adil Butt) లతో సమవుజ్జీగా మారారు. లంకపై అజేయంగా సాధించిన 114 పరుగులు ఇంగ్లండ్ ఆటగాళ్ల అత్యధిక వ్యక్తిగత స్కోర్లలో ఐదో స్థానంలో నిలిచింది.




