Heinrich Klaasen: మిమ్మల్ని మట్టికరిపిస్తా, ఇదే నా ప్రామిస్.. ఫ్యాన్‌కు క్లాసెన్ వార్నింగ్!

Heinrich Klaasen: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rishvik
Updated on: 1 May 2026 8:25 PM IST
Heinrich Klaasen
X

Heinrich Klaasen: మిమ్మల్ని మట్టికరిపిస్తా, ఇదే నా ప్రామిస్.. ఫ్యాన్‌కు క్లాసెన్ వార్నింగ్!

Heinrich Klaasen: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న సమయంలో ఒక అభిమాని వీడియో తీయడంతో.. క్లాసెన్ అసహనానికి గురైయ్యాడు. అనుమతి లేకుండా తనను, తన కుటుంబ సభ్యులను ఫొటోలు, వీడియోలు వైతీయొద్దంటూ హెచ్చరించాడు. వీడియో తీయడం ఆపకపోతే.. పరిస్థితి మరోలా ఉంటుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించింది. అనంతరం ముంబై నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లు హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ సమయంలో హెన్రిచ్ క్లాసెన్‌తో ఓ అభిమాని మాట్లాడాడు ‘సర్.. మీరు చాలా బాగా ఆడారు’ అని అన్నాడు. 'థాంక్యూ వెరీ మచ్ సర్. మీరు దయచేసి నా ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు తీయొద్దు.

నేను అటు తిరిగితే.. నా ఫ్యామిలీ ఫొటోలు మీరు తీస్తారు. కానీ అలా చేయొద్దు ప్లీజ్. మీరు వీడియో తీయడం ఆపకపోతే మిమ్మల్ని మట్టికరిపిస్తానని ప్రామిస్ చేస్తున్నా' అంటూ క్లాసెన్‌ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటనపై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు క్లాసెన్ ప్రైవసీని గౌరవించాల్సిందేనని అంటుండగా.. మరికొందరు అతని స్పందన కొంచెం కఠినంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.

ముంబై ఇండియన్స్‌పై అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ దుమ్మురేపారు. తొలి వికెట్‌కు 129 పరుగులు జోడించారు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ 30 బంతుల్లో అజేయంగా 65 పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడు. అతని షాట్లు, ముఖ్యంగా స్పిన్నర్లపై ఆడిన రివర్స్ షాట్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. క్లాసెన్ బ్యాటింగ్‌పై మాజీ దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ ప్రశంసలు కురిపించాడు.

'ముంబై ఇండియన్స్‌పై క్లాసెన్ ఆడిన ఇన్నింగ్స్‌ అద్భుతం. ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. ఓపెనర్లు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత మిడిల్ ఆర్డర్‌లో వచ్చి కూడా ఇంత ప్రభావవంతంగా ఆడటం గొప్ప విషయం. క్లాసెన్ హ్యాండ్-ఐ కోఆర్డినేషన్ అద్భుతం. ఒత్తిడిలో కూడా తన సామర్థ్యాన్ని నమ్ముకొని ఆడటం అతని ప్రత్యేకత' అని స్టెయిన్ ప్రశంసించాడు.


Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story