HKW vs INDW: 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో దుమ్మురేపిన టీమిండియా.. పవర్ ప్లేలో భారీ రికార్డ్..!

HKW vs INDW: 2026 మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత బ్యాటర్లు పవర్‌ప్లేలో దుమ్మురేపుతున్నారు.

Venkat
Published on: 3 Sept 2026 8:56 PM IST
HKW vs INDW
X

HKW vs INDW: 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో దుమ్మురేపిన టీమిండియా.. పవర్ ప్లేలో భారీ రికార్డ్..!

Women’s T20 Asia Cup: 2026 మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత బ్యాటర్లు పవర్‌ప్లేలో దుమ్మురేపుతున్నారు. తొలి ఆరు ఓవర్లలోనే థాయ్‌లాండ్‌పై 65/1 పరుగులు సాధించిన భారత్‌.. ఇప్పుడు హాంకాంగ్‌పై 60/0తో మరోసారి సత్తా చాటింది. ఆసియా కప్‌ చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధిక స్కోర్ల జాబితాలో భారత్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచింది.

మహిళల టీ20 ఆసియా కప్‌లో పవర్‌ప్లే స్కోర్లు..

టాప్‌-5 పవర్‌ప్లే స్కోర్లు..

65/1 – భారత్ vs థాయ్‌లాండ్‌, దుబాయ్‌, 2026

60/0 – భారత్ vs హాంకాంగ్‌, దుబాయ్‌, 2026

59/0 – భారత్ vs బంగ్లాదేశ్‌, సిల్హెట్‌, 2022

58/1 – శ్రీలంక vs యూఏఈ, దుబాయ్‌, 2026

57/0 – భారత్ vs పాకిస్థాన్‌, దంబుల్లా, 2024

ఈ జాబితాలోని తొలి మూడు స్థానాల్లో రెండూ భారత్‌వే. పవర్‌ప్లేలో భారత మహిళల బ్యాటింగ్‌ దూకుడు ఏ స్థాయిలో ఉందో ఈ గణాంకాలు చెబుతున్నాయి.

మహిళల ఆసియా కప్‌ 2026లో హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. 8 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 74 పరుగులు చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన 31 బంతుల్లో 44 పరుగులతో క్రీజులో ఉంది. షెఫాలీ 17 బంతుల్లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.

మంధాన తన ఇన్నింగ్స్‌లో బౌండరీలతో అలరిస్తూ భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తోంది. పవర్‌ప్లేలోనే భారత్‌ వేగంగా పరుగులు సాధించగా.. ప్రస్తుతం 9కు పైగా రన్‌రేట్‌తో కొనసాగుతోంది.

మ్యాచ్‌ పరిస్థితి..

భారత్‌: 85/1 (10 ఓవర్లు)

స్మృతి మంధాన: 48 (31)

రావర్ : 5 (6)

రన్‌రేట్‌: 8.50

భారత్‌ ఇదే వేగాన్ని కొనసాగిస్తే భారీ స్కోరు సాధించే అవకాశం కనిపిస్తోంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story