షెఫాలీతో అనుచిత ప్రవర్తనపై ఐసీసీ సిరీయస్.. పాకిస్థాన్ కెప్టెన్‌కు జరిమానా..!

ICC Fines Pakistan Captain Fatima Sana: మహిళల ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ షెఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత అనుచిత సంజ్ఞలు చేసిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాపై ఐసీసీ చర్యలు తీసుకుంది.

Venkat
Published on: 7 Sept 2026 4:54 PM IST
ICC Fines Pakistan Captain Fatima Sana
X

షెఫాలీతో అనుచిత ప్రవర్తనపై ఐసీసీ సిరీయస్.. పాకిస్థాన్ కెప్టెన్‌కు జరిమానా..!

ICC Fines Pakistan Captain Fatima Sana: మహిళల ఆసియా కప్ గ్రూప్-A పోరులో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అసభ్యకర ప్రవర్తన ప్రదర్శించినందుకు పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవల్-1 నిబంధనను ఉల్లంఘించినందుకు ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది.

మైదానంలో ఏం జరిగింది?

భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఫాతిమా సనా బౌలింగ్‌లో ఓపెనర్ షెఫాలీ వర్మ వికెట్ కోల్పోయింది. వికెట్ దక్కిన ఆవేశంలో ఫాతిమా సనా భారత బ్యాటర్‌ను ఉద్దేశించి దూకుడుగా అనుచిత సైగలు చేస్తూ సెండ్‌ఆఫ్ ఇచ్చింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని భావించిన ఫీల్డ్ అంపైర్లు, మ్యాచ్ రిఫరీ ఆమెపై చర్యలకు సిఫార్సు చేశారు.

డిసిప్లినరీ రికార్డులో మరో డీమెరిట్ పాయింట్..

జరిమానాతో పాటు ఫాతిమా సనా డిసిప్లినరీ రికార్డుకు ఒక డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ జోడించింది. గడిచిన 24 నెలల కాలంలో ఆమెకు ఇది రెండవ డీమెరిట్ పాయింట్ కావడం గమనార్హం. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్ల పట్ల రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు ఆర్టికల్ 2.5 ప్రకారం ఈ శిక్ష ఖరారైంది.

తప్పు ఒప్పుకున్న పాక్ సారథి..

మ్యాచ్ రిఫరీ విధించిన ఈ శిక్షను, తన తప్పిదాన్ని ఫాతిమా సనా అధికారికంగా అంగీకరించింది. దాంతో ఎలాంటి ప్రత్యేక విచారణ అవసరం లేకుండానే వ్యవహారం ముగిసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత మహిళల జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించింది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story