IND vs AFG 3rd ODI: అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డేకు ముందు కీలక మార్పు.. భారత జట్టులోకి 'ధురంధర్'!
IND vs AFG 3rd ODI: అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డే మ్యాచ్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది.
IND vs AFG 3rd ODI: అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డేకు ముందు కీలక మార్పు.. భారత జట్టులోకి 'ధురంధర్'!
IND vs AFG 3rd ODI: స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించిన టీమిండియా.. ఇప్పుడు చెన్నై వేదికగా శనివారం (జూన్ 20) జరగనున్న మూడో వన్డేపై దృష్టి సారించింది. చివరి మ్యాచ్లి గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా గత కొన్ని నెలలుగా జట్టుకు దూరమైన యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మళ్లీ భారత జట్టులో చేరాడు.
టీ20 ప్రపంచకప్ 2026కు ముందు ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ సందర్భంగా హర్షిత్ రాణా మోకాలి గాయానికి గురయ్యాడు. గాయం కారణంగా ధురంధర్ హర్షిత్ ప్రపంచకప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అంతేకాకుండా ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున కూడా బరిలోకి దిగలేదు. అయితే ఇప్పుడు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో పునరావాస ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న హర్షిత్.. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి జట్టుతో కలిశాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు.
24 ఏళ్ల హర్షిత్ రాణా ఇప్పటివరకు భారత్ తరఫున 14 వన్డేలు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 27.38 కాగా.. ఎకానమీ రేటు 6.21గా ఉంది. వేగం, బౌన్స్‌తో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీయగల సామర్థ్యంతో అతడు సెలెక్టర్ల విశ్వాసాన్ని సంపాదించాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చివరిసారిగా భారత జెర్సీలో కనిపించిన హర్షిత్.. ఇప్పుడు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మూడో వన్డేలో అవకాశం వస్తే తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు.
హర్షిత్ రాణాను త్వరలో జరిగే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం కూడా భారత జట్టులో బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ పర్యటనల్లో భారత్ మొత్తం ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత అతడికి అత్యంత కీలకమైన సిరీస్‌లుగా మారనున్నాయి. అఫ్గానిస్థాన్‌తో సిరీస్ ఇప్పటికే భారత్ ఖాతాలో చేరిన నేపథ్యంలో మూడో వన్డేలో యువ ఆటగాళ్లకు అవకాశాలు లభించే అవకాశం ఉంది. హర్షిత్ తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. పునరాగమనంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డేకు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా.




