IND vs AFG: రోహిత్-కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలనుకున్న సెలెక్టర్లు.. యూ టర్న్ ఎందుకు తీసుకున్నారంటే?
BCCI U-Turn on Resting Rohit-Kohli. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కీలక నిర్ణయం ఇప్పుడు భారత క్రికెట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
IND vs AFG: రోహిత్-కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలనుకున్న సెలెక్టర్లు.. యూ టర్న్ ఎందుకు తీసుకున్నారంటే?
IND vs AFG: బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కీలక నిర్ణయం ఇప్పుడు భారత క్రికెట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ తాజాగా అఫ్గానిస్థాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతి ఇవ్వాలని తొలుత భావించినట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో వెల్లడించింది. అయితే చివరికి సెలెక్టర్లు తమ నిర్ణయాన్ని మార్చుకుని.. ఇద్దరినీ జట్టులో కొనసాగించారు.
అఫ్గానిస్థాన్‌తో జూన్ 14 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లు ఉన్నాయి. అయితే ఈ నిర్ణయం వెనుక పెద్ద చర్చే జరిగినట్లు సమాచారం. ఐపీఎల్ 2026లో భారీగా వర్క్‌లోడ్‌ను ఎదుర్కొన్న ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు ముందుగా ఆలోచించారట. అయితే ప్రస్తుతం రోహిత్, కోహ్లీలు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతుండటంతో.. వారికి మ్యాచ్ ప్రాక్టీస్ ఎంతో అవసరమని సెలెక్షన్ కమిటీ భావించింది. అదే కారణంతో అఫ్గానిస్థాన్ సిరీస్‌కు వారిని ఎంపిక చేసినట్లు ఓ నివేదిక పేర్కొంది.
2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు మార్పుల దశలో ఉందని.. సీనియర్ క్రికెటర్లు రోహిత్, కోహ్లీలతో యువ ఆటగాళ్లు కలిసి ఆడితే నేర్చుకుంటారని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచించినట్లు సమాచారం. అలాగే రో-కో ఫిట్‌నెస్, ప్రదర్శనలను కూడా ఈ సిరీస్‌లో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన వన్డే భవిష్యత్తుపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను జట్టుకు విలువ చేకూరుస్తున్నానని టీమ్ భావిస్తే తప్పకుండా కొనసాగుతాను. కానీ ప్రతి సారి నా విలువను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే నేను ఆ వాతావరణంలో ఉండను' అని కోహ్లీ స్పష్టం చేశాడు.
'నేను నా ఆట పట్ల పూర్తి నిబద్ధతతో పని చేస్తాను. నా క్రికెట్ కెరీర్‌లో నాకు లభించిన ప్రతిదానికి ఆ దేవుడికి కృతజ్ఞుడిని. మైదానంలోకి అడుగుపెడితే.. నా పని నేను పూర్తిగా చేస్తాను. ఎప్పుడూ జట్టు గెలవాలనే కోరుకుంటా' అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. వన్డే వరల్డ్ కప్ 2027లో ఆడాలని రోహిత్, కోహ్లీలు చూస్తున్నారు. అప్పటివరకు ఈ ఇద్దరు కొనసాగుతారా లేదా అన్నది వారి ఫామ్, ఫిట్‌నెస్, జట్టు అవసరాలపై ఆధారపడి ఉంటుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.




