IND vs IRE 2nd T20: టీమిండియాలోకి ఇద్దరు అరంగేట్రం.. వైభవ్ సూర్యవంశీకి మాత్రం నిరాశే!
IND vs IRE 2nd T20: Vaibhav Sooryavanshi missed out once again యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈసారి కూడా తుది జట్టులో అవకాశం దక్కలేదు.
IND vs IRE 2nd T20: టీమిండియాలోకి ఇద్దరు అరంగేట్రం.. వైభవ్ సూర్యవంశీకి మాత్రం నిరాశే!
IND vs IRE Playing XI: ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బెల్‌ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో శ్రేయస్ అయ్యర్ సేన బరిలోకి దిగింది. తొలి టీ20లో చారిత్రక ఓటమిని చవిచూసిన భారత్.. ఈ మ్యాచ్‌లో తప్పక గెలిచి సిరీస్‌ను 1-1తో ముగించాలని పట్టుదలగా ఉంది.
టాస్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందుగా బౌలింగ్ ఎంచుకున్నామని తెలిపారు. మ్యాచ్ మధ్యలో ఎప్పుడైనా వర్షం పడే అవకాశం ఉన్నందున ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవాలని భావించినట్లు చెప్పారు.
తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్నామని, ఈసారి పరిస్థితులకు త్వరగా అలవాటు పడుతూ తెలివైన క్రికెట్ ఆడడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఐపీఎల్ 2026 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి రావడం కొంత భిన్నంగా అనిపించినప్పటికీ.. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటంతో త్వరగా లయ అందుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. తొలి మ్యాచ్ తమకు ఒక చెడు రోజుగా మిగిలిపోయిందని, ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నామని అయ్యర్ అన్నాడు.
ఈ మ్యాచ్‌కు భారత జట్టులో రెండు మార్పులు చేశారు. యువ ఆటగాళ్లు సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. వీరిద్దరూ భారత్ తరఫున టీ20ల్లో ఆడుతున్న 120వ, 121వ ఆటగాళ్లుగా నిలిచారు.
ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈసారి కూడా తుది జట్టులో అవకాశం దక్కలేదు. సీనియర్ల పైనే కెప్టెన్ శ్రేయాస్ నమ్మకం ఉంచాడు. తొలి టీ20లో ఐర్లాండ్ చేతిలో ఎదురైన 34 పరుగుల పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా చూస్తోంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసి సిరీస్‌ను సమం చేయాలని లక్ష్యంగా ఉంది.
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబె, సూర్యాంశ్ షెడ్జ్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
ఐర్లాండ్: టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్/కెప్టెన్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై మూన్‌డ్రా, మాథ్యూ హోలార్డ్.




