IND vs NZ 2026: రోహిత్-కోహ్లీకి ఇదే చివరి టూర్.. భారత్-న్యూజిలాండ్ ఫుల్ షెడ్యూలు ఇదే!
IND vs NZ 2026: 2026లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న పూర్తి స్థాయి సిరీస్ షెడ్యూల్‌ను కివీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
IND vs NZ 2026: రోహిత్-కోహ్లీకి ఇదే చివరి టూర్.. భారత్-న్యూజిలాండ్ ఫుల్ షెడ్యూలు ఇదే!
IND vs NZ 2026: 2026లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న పూర్తి స్థాయి సిరీస్ షెడ్యూల్‌ను కివీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగే ఈ పర్యటనలో టీమిండియా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తంగా ఇది 40 రోజుల సుదీర్ఘ పర్యటన కాగా.. న్యూజిలాండ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద పర్యటన. గతంలో ఏ క్రికెట్ జట్టు కూడా కివీస్ గడ్డపై ఇన్ని మ్యాచ్‌లు ( 12) ఆడలేదు. భారత్-న్యూజిలాండ్ దేశాల మధ్య నెలకొన్న వందేళ్ల క్రీడా సంబంధాలకు ఈ సిరీస్ ప్రతీకగా నిలవనుంది. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు కూడా న్యూజిలాండ్‌లో పర్యటించనున్నప్పటికీ.. భారత జట్టు సిరీస్‌పైనే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టి నిలిచింది.
భారత జట్టు చివరిసారిగా 2019-20లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఆ సిరీస్‌లో టీ20ల్లో 5-0తో ఆతిథ్య జట్టును క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత జరిగిన వన్డే, టెస్టు సిరీస్‌లలో మాత్రం పరాజయం పాలైంది. ముఖ్యంగా 2009 తర్వాత న్యూజిలాండ్ గడ్డపై భారత్ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. ఈసారి ఆ నిరీక్షణకు తెరదించాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 22న టీ20, నంబర్ 4న వన్డే, నవంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్నాయి. 2010 తర్వాత న్యూజిలాండ్ రెండుసార్లు భారత గడ్డపై ఆడింది. 20225 టూర్‌లో కివీస్ 3-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను క్లీస్ స్వీప్ చేసింది.
ఈ పర్యటన భారత దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు న్యూజిలాండ్‌లో చివరి సిరీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమ కెరీర్ చివరి దశలో ఉన్న ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు 2027 వన్డే వరల్డ్ కప్‌ను లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే వన్డే క్రికెట్‌లో కలిసి 22 వేలకు పైగా పరుగులు చేసిన రోహిత్, కోహ్లీ.. మరోసారి జట్టుకు కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. 2027 వరల్డ్ కప్‌కు ముందు జరిగే ప్రధాన విదేశీ పర్యటనల్లో ఇది అత్యంత కీలకమైనది అనే చెప్పాలి. టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్లలో పూర్తి స్థాయి సిరీస్ కావడంతో ఈ పర్యటనపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా న్యూజిలాండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలనే భారత జట్టు లక్ష్యం, రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ఉన్న చర్చలు ఈ సిరీస్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తున్నాయి. 2026 చివర్లో జరిగే ఈ పర్యటన ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఆసక్తికరమైన సిరీస్‌లలో ఒకటిగా నిలవనుంది.
భారత్-న్యూజిలాండ్ 2026 పూర్తి షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం):
టీ20 సిరీస్:
అక్టోబర్ 22 – 1వ టీ20 – హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్ – మధ్యాహ్నం 1:30
అక్టోబర్ 24 – 2వ టీ20 – హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్ – మధ్యాహ్నం 1:30
అక్టోబర్ 27 – 3వ టీ20 – హెచ్‌ఎన్‌ఆర్‌వై స్టేడియం, వెల్లింగ్టన్ – మధ్యాహ్నం 1:30
అక్టోబర్ 30 – 4వ టీ20 – ఈడెన్ పార్క్, ఆక్లాండ్ – మధ్యాహ్నం 1:30
నవంబర్ 1 – 5వ టీ20 – సెడన్ పార్క్, హామిల్టన్ – మధ్యాహ్నం 1:30
వన్డే సిరీస్:
నవంబర్ 4 – 1వ వన్డే – ఈడెన్ పార్క్, ఆక్లాండ్ – ఉదయం 8:30
నవంబర్ 7 – 2వ వన్డే – హెచ్‌ఎన్‌ఆర్‌వై స్టేడియం, వెల్లింగ్టన్ – ఉదయం 8:30
నవంబర్ 10 – 3వ వన్డే – సెడన్ పార్క్, హామిల్టన్ – ఉదయం 8:30
నవంబర్ 13 – 4వ వన్డే – బే ఓవల్, టౌరంగా – ఉదయం 8:30
నవంబర్ 15 – 5వ వన్డే – బే ఓవల్, టౌరంగా – ఉదయం 8:30
టెస్టు సిరీస్:
నవంబర్ 19 నుంచి 23 వరకు – 1వ టెస్టు – బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ – ఉదయం 4:30
నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు – 2వ టెస్టు – హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్ – ఉదయం 4:30




