IND vs SL Test Series: టీమిండియాకు భారీ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
IND vs SL Test Series: Jasprit Bumrah Likely Ruled Out of IND vs SL Test Series. శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
IND vs SL Test Series: టీమిండియాకు భారీ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
IND vs SL Test Series: శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ రెండు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. బూమ్ బూమ్ మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో టెస్టు సిరీస్‌కు దూరమవుతున్నట్లు సమాచారం. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స పొందుతున్న బుమ్రా.. మోకాలికి అయిన గాయంతో ఇంకా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తొందరపాటు నిర్ణయంతో టెస్టు సిరీస్‌లో ఆడించకూడదని వైద్య బృందం నిర్ణయించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని రెండో మ్యాచులో జస్ప్రీత్ బుమ్రా మోకాలికి గాయం అయ్యింది. గతంలో అయిన గాయమే (ఎడమ మోకాలిలో వాపు) మళ్లీ తిరగబడింది. దాంతో అతడు మూడో మ్యాచ్ ఆడలేదు. ఆ తర్వాత బుమ్రా పునరావాసం కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లాడు. శ్రీలంక సిరీస్ ప్రారంభానికి ముందే పూర్తిగా కోలుకుంటాడని తొలుత భావించినప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితి ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. ఆగస్టు 15న గాలేలో తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. ఆగస్టు 23 నుంచి రెండో టెస్టు జరగనుంది.
జస్ప్రీత్ బుమ్రా కోలుకున్నా కూడా అతడిని వెంటనే టెస్టు క్రికెట్‌లోకి దించడంపై వైద్య బృందం సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. శ్రీలంక పిచ్‌లపై ఎక్కువసేపు బౌలింగ్ చేయాల్సి ఉండటం, రాబోయే నెలల్లో భారత జట్టుకు తీరికలేని అంతర్జాతీయ షెడ్యూల్ ఉండటంతో అతడి వర్క్‌లోడ్‌ను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అందుకే పూర్తిగా ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే బుమ్రాను బరిలోకి దించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 తర్వాత విరామం తీసుకున్న బుమ్రా.. గత నెలలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌తో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే.
జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన పేసర్ ఆకిబ్ నబీ లేదా విదర్భ ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్‌కు అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే భారత సెలక్షన్ కమిటీ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే టీమిండియా గాయాల సమస్యతో సతమతమవుతోంది. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా హ్యామ్‌స్ట్రింగ్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా హ్యామ్‌స్ట్రింగ్ సమస్య కారణంగా తొలి టెస్టుకు అందుబాటులో ఉండడు. ఇప్పుడు బుమ్రా కూడా దూరమయ్యే పరిస్థితి ఏర్పడడంతో.. శ్రీలంక పర్యటనకు ముందు భారత జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవ్‌దత్ పడిక్కల్, సరాంశ్ జైన్.




