ZIM vs IND: చెలరేగిన టీమిండియా కొత్త బౌలర్లు.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం.. శ్రేయస్‌కు తొలి విజయం పక్కా!

India restricted Zimbabwe to 125/7 in the first T20I. జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత యువ బౌలర్లు చెలరేగారు.

Rishvik
Published on: 23 July 2026 6:51 PM IST
ZIM vs IND
X

ZIM vs IND: చెలరేగిన టీమిండియా కొత్త బౌలర్లు.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం.. శ్రేయస్‌కు తొలి విజయం పక్కా!

ZIM vs IND: జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత యువ బౌలర్లు చెలరేగారు. టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులే చేసింది. దీంతో భారత్ ముందు 126 పరుగుల లక్ష్యం ఉంది. వెస్లీ మద్వీర (39) టాప్ స్కోరర్ కాగా.. మరుమాని (27), ర్యాన్ బర్ల్ (26) రాణించారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు.

ఈ టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో జింబాబ్వే ముందుగా బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతికే బ్రయాన్ బెన్నెట్‌ను ఔట్ చేసిన మయాంక్ యాదవ్ భారత్‌కు అద్భుత ఆరంభాన్ని అందించాడు. అనంతరం డియోన్ మైయర్స్‌ను కూడా పెవిలియన్‌కు పంపి రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ బెన్ కరన్, బ్రాడ్ ఎవాన్స్ వికెట్లను పడగొట్టి రెండు వికెట్లు సాధించాడు.

ప్రారంభంలో వరుసగా వికెట్లు కోల్పోయిన జింబాబ్వేను వెస్లీ మద్వీర ఆదుకునే ప్రయత్నం చేశాడు. అతడు 34 బంతుల్లో 39 పరుగులు చేసి స్కోర్ స్కోరును ముందుకు నడిపించాడు. ర్యాన్ బర్ల్ 35 బంతుల్లో 26 పరుగులు చేయగా.. వికెట్‌కీపర్ తాడివనాషే మరుమాని చివరి వరకు క్రీజులో నిలిచి 20 బంతుల్లో అజేయంగా 27 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి పోరాటంతో జింబాబ్వే గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. భారత్ బౌలర్లలో మయాంక్ యాదవ్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్ 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు దక్కించుకోగా.. శివమ్ దూబే, రవి బిష్ణోయ్ ఒక వికెట్ తీశారు. అశోక్ శర్మ వికెట్ తీయలేకపోయినా తన నాలుగు ఓవర్లలో 289 రన్స్ ,మాత్రమే ఇచ్చాడు.

126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనున్నారు. అనంతరం ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబేలతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించనుంది. సిరీస్‌లో శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. ముజరబాని వేసిన తొలి ఓవర్‌లో రెండే పరుగులు వచ్చాయి. అభిషేక్ (1), వైభవ్ (1) క్రీజులో ఉన్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story