సర్పంచ్ సాబ్ కంటే ముందు తెలుగోడి కెప్టెన్సీలో ఆడనున్న బుడ్డోడు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

India A Squad: ఐపీఎల్ 2026 సీజన్‌లో బౌలర్లకు చుక్కలు చూపించి, బీసీసీఐ సెలక్టర్లను సైతం ఆశ్చర్యపరిచిన బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి భారత జట్టులో స్థానం దక్కిన సంగతి తెలిసిందే.

Venkat
Published on: 8 Jun 2026 7:41 PM IST
సర్పంచ్ సాబ్ కంటే ముందు తెలుగోడి కెప్టెన్సీలో ఆడనున్న బుడ్డోడు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
X

సర్పంచ్ సాబ్ కంటే ముందు తెలుగోడి కెప్టెన్సీలో ఆడనున్న బుడ్డోడు.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

India A Tri Series Schedule: భారత క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న 15 ఏళ్ల వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం యావత్ దేశం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లేముందే ఈ యువ సంచలనం కేవలం రెండు రోజుల్లోనే లంక గడ్డపై తన ప్రతాపం చూపించడానికి సిద్ధమయ్యాడు. ఇండియా ‘ఎ’ తరఫున అతడు ఆడబోయే మ్యాచ్‌ల పూర్తి వివరాలు మీకోసం.

లంక గడ్డపై ముక్కోణపు పోరు.. తిలక్ వర్మ సారథ్యం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో బౌలర్లకు చుక్కలు చూపించి, బీసీసీఐ సెలక్టర్లను సైతం ఆశ్చర్యపరిచిన బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి భారత జట్టులో స్థానం దక్కిన సంగతి తెలిసిందే. అయితే, సీనియర్ జట్టుతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లే ముందే, శ్రీలంక వేదికగా జరిగే ముక్కోణపు వన్డే సిరీస్‌లో వైభవ్ తన బ్యాటింగ్ పవర్‌ను చూపించనున్నాడు. టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ ఈ సిరీస్‌లో ఇండియా ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆడటానికి ముందే, వైభవ్ ఈ సిరీస్‌లో తిలక్ వర్మ నాయకత్వంలో బరిలోకి దిగడం విశేషం. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో ఇండియా ‘ఎ’తో పాటు శ్రీలంక ‘ఎ’, ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’ జట్లు తలపడనున్నాయి. వైభవ్‌తో పాటు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రియాన్ పరాగ్ వంటి యువ కిరటాలపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

ముక్కోణపు సిరీస్ పూర్తి షెడ్యూల్..

దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లన్నీ జరగనున్నాయి. మ్యాచ్‌ల పూర్తి వివరాలు:

తేదీ మ్యాచ్ సమయం (భారత కాలమానం)

జూన్ 9, మంగళవారం శ్రీలంక ఎ vs ఇండియా ఎ ఉదయం 10:00 గంటలకు

జూన్ 11, గురువారం ఆఫ్ఘనిస్తాన్ ఎ vs ఇండియా ఎ ఉదయం 10:00 గంటలకు

జూన్ 13, శనివారం శ్రీలంక ఎ vs ఆఫ్ఘనిస్తాన్ ఎ ఉదయం 10:00 గంటలకు

జూన్ 15, సోమవారం శ్రీలంక ఎ vs ఇండియా ఎ ఉదయం 10:00 గంటలకు

జూన్ 17, బుధవారం ఆఫ్ఘనిస్తాన్ ఎ vs ఇండియా ఎ ఉదయం 10:00 గంటలకు

జూన్ 19, శుక్రవారం శ్రీలంక ఎ vs ఆఫ్ఘనిస్తాన్ ఎ ఉదయం 10:00 గంటలకు

జూన్ 21, ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఉదయం 10:00 గంటలకు

ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలి?

భారతదేశంలోని క్రికెట్ ప్రేమికులు ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను టీవీల్లో ‘సోనీ స్పోర్ట్స్’ ఛానళ్ల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. డిజిటల్ మొబైల్ వినియోగదారులు ‘సోనీ లివ్’ (SonyLIV) యాప్ ద్వారా ఈ ముక్కోణపు సిరీస్ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం ప్రతిరోజూ ఉదయం 10:00 గంటలకే ప్రారంభం అవుతాయి.

మూడు జట్ల వివరాలు

ఇండియా ‘ఎ’ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాంశ్ శెడ్గే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కుమార్ కుశాగ్ర, విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుద్ధ్‌వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.

ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’ జట్టు: ఇమ్రాన్ మీర్ (కెప్టెన్), నూర్ రెహమాన్, మహ్మద్ ఇషాక్, హసన్ ఈసాఖిల్, ఖలీద్ తానివాల్, ఇజాజ్ అహ్మద్‌జాయ్, బహీర్ షా మహబూబ్, ఫైసల్ ఖాన్ షినోజాదా, ఫర్మానుల్లా సఫీ, షామ్స్ ఉర్ రెహమాన్, ఖలీల్ గుర్బాజ్, జహీర్ ఖాన్ పక్తీన్, ఫరీదూన్ దావూద్‌జాయ్, మహ్మద్ ఇబ్రహీం, అబ్దుల్లా అహ్మద్‌జాయ్.

శ్రీలంక ‘ఎ’ జట్టు: సహాన్ అరాచ్చిగే (కెప్టెన్), నిరోషన్ డిక్వెల్లా (వైస్ కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, నువనిందు ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, అహాన్ విక్రమసింఘే, చమిక కరుణారత్నే, వనూజ సహాన్, విజయకాంత్ వియాస్కాంత్, మహ్మద్ షిరాజ్, దులజ్ సముదిత, విషేన్ హలంబెజ్, రవిందు ఫెర్నాండో, చమిక గుణశేఖర, గరుక సంకేత్, కుగదాస్ మథులన్.

భారత యువ క్రికెట్ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన టోర్నీగా ఈ లంక పర్యటన నిలవనుంది. ప్రధానంగా 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌లో ఎలాంటి విన్యాసాలు చేయబోతున్నాడనే దానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తిలక్ వర్మ నాయకత్వంలోని భారత యువ సేన లంక గడ్డపై ముక్కోణపు సిరీస్ కైవసం చేసుకుని విజయకేతనం ఎగరేస్తుందని ఆశిద్దాం.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story