IND vs ZIM: మరోసారి 200+ స్కోరు.. టీ20ల్లో టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు!
India equalled its own world record of nine 200-plus totals in a calendar year. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 200లకు పైగా స్కోర్లు చేసిన జట్టుగా భారత్ తన సొంత రికార్డును సమం చేసింది.
IND vs ZIM: మరోసారి 200+ స్కోరు.. టీ20ల్లో టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు!
IND vs ZIM: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి.. ప్రత్యర్థి ముందు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. స్టార్ బ్యాటర్లు షాన్ కిషన్ (81; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (60; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు హాఫ్ సెంచరీలతో భారత్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (20), అభిషేక్ శర్మ (8) నిరాశపరిచారు. అయితే ఈ ఇన్నింగ్స్‌తో టీమిండియా మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 200లకు పైగా స్కోర్లు చేసిన జట్టుగా భారత్ తన సొంత రికార్డును సమం చేసింది. 2026లో ఇప్పటివరకు భారత్ తొమ్మిది సార్లు 200 ప్లస్ స్కోరు నమోదు చేసింది. ఇదే రికార్డును 2024లో కూడా టీమిండియా నెలకొల్పింది. ఈ జాబితాలో 2023లో భారత్ ఏడు సార్లు 200+ స్కోర్లు నమోదు చేయగా.. 2024లో జపాన్, 2025లో ఆస్ట్రియా తలో ఏడు సార్లు ఈ ఘనత సాధించాయి. 2022లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా.. 2024లో వెస్టిండీస్ ఆరేసి సార్లు 200లకు పైగా స్కోర్లు నమోదు చేశాయి.
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు 200కు పైగా స్కోర్లు చేసిన జట్టుగానూ భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు టీమిండియా మొత్తం 52 సార్లు 200కు పైగా స్కోరు నమోదు చేసింది. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా.. కేవలం 29 సార్లు మాత్రమే ఈ మార్క్‌ను అందుకుంది. 200కు పైగా స్కోర్లు చేయడంలో భారత్ మిగతా జట్ల కంటే ఎంతో ముందంజలో ఉంది. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కూడా ఈ రికార్డును బ్రేక్ చేయడం చాలా కష్టం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్, వెస్టిండీస్ లాంటి టాప్ జట్లపై కూడా టీమిండియా 200కు పైగా స్కోర్ చేసింది.
జింబాబ్వేపై కూడా భారత్ భారీ స్కోర్ల పరంపరను కొనసాగిస్తోంది. 2026 టీ20 ప్రపంచ కప్‌లో చెన్నైలో జింబాబ్వేపై భారత్ 256/4 పరుగులు నమోదు చేయగా.. 2024లో హరారేలో 234/2 స్కోరు చేసింది. తాజాగా 2026 రెండో టీ20లో మరోసారి 219/5 పరుగులు చేసి.. జింబాబ్వేపై 200కు పైగా స్కోరును మరోసారి నమోదు చేసింది. ఇది జింబాబ్వేపై భారత్ సాధించిన మూడో 200+ స్కోరు కావడం విశేషం. హరారే మైదానం భారత జట్టుకు బాగా కలిసొస్తోంది.
టీ20ల్లో దూకుడైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన టీమిండియా.. యువ ఆటగాళ్ల రాకతో మరింత ప్రమాదకరంగా మారింది. వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి యువ బ్యాటర్లు దూకుడుగా ఆడుతుండటంతో.. భారీ స్కోర్లు చేయడం భారత జట్టుకు అలవాటుగా మారుతోంది. ఇదే జోరు కొనసాగితే రాబోయే టీ20 ప్రపంచ కప్‌లలో కూడా భారత బ్యాటింగ్ విభాగం ప్రత్యర్థులకు పెద్ద సవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. టీమిండియాలోకి యువ బ్యాటర్లు రావడానికి, ఎలాంటి బెరుకు లేకుండా ఆడడానికి ఐపీఎల్ కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.




