IND vs IRE 2nd T20: 513 రోజుల తర్వాత అరంగేట్రం.. టీమిండియా కంటే ముందంజలో పాకిస్తాన్!
IND vs IRE 2nd T20: India now has 121 T20I caps. భారత్ తరఫున చివరిసారిగా టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడు హర్షిత్ రాణా
IND vs IRE 2nd T20: 513 రోజుల తర్వాత అరంగేట్రం.. టీమిండియా కంటే ముందంజలో పాకిస్తాన్!
IND vs IRE 2nd T20: బెల్‌ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు తరఫున ఇద్దరు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గే, పేసర్ ప్రిన్స్ యాదవ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్నారు.
ఈ ఇద్దరు వరుసగా భారత తరఫున 120వ, 121వ టీ20 ఇంటర్నేషనల్ క్యాప్‌లు అందుకున్నారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగిన యువ క్రికెటర్లు సూర్యాంశ్,ప్రిన్స్ భారత జట్టులో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు.ఇద్దరు మంచి ఆరంభం ఇవ్వాలని చుస్తున్నారు.
513 రోజుల తర్వాత కొత్త టీ20 అరంగేట్రం:
భారత్ తరఫున చివరిసారిగా టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడు హర్షిత్ రాణా. అతడు 2025 జనవరిలో తొలి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఏకంగా 513 రోజుల విరామం తర్వాత భారత జట్టు మరోసారి కొత్త ఆటగాళ్లకు టీ20 క్యాప్‌లు అందించింది. టీ20 చరిత్రలో భారత్‌కు రెండు అరంగేట్రాల మధ్య ఇదే అత్యంత సుదీర్ఘ విరామంగా నిలిచింది.
ఇంతకుముందు ఈ రికార్డు 451 రోజులుగా ఉంది. 2012 డిసెంబర్ 25న స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ భారత తరఫున 45వ టీ20 క్యాప్ అందుకున్నాడు. ఆ తర్వాత 2014 మార్చి 21న వెటరన్ పేసర్ మహ్మద్ షమీ 46వ క్యాప్ అందుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డును సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ అరంగేట్రంతో అధిగమించారు.
టీ20ల్లో భారత్‌కు 120వ, 121వ క్యాప్‌లు:
సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ భారత టీ20 చరిత్రలో వరుసగా 120వ, 121వ క్యాప్‌లు అందుకున్న ఆటగాళ్లుగా నిలిచారు. టీ20 ఫార్మాట్‌లో ఇంతమంది ఆటగాళ్లకు అవకాశం ఇచ్చిన జట్లలో భారత్ రెండో స్థానంలో ఉంది.
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మంది ఆటగాళ్లకు అవకాశం ఇచ్చిన జట్టుగా పాకిస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు పాకిస్థాన్ 125 మంది ఆటగాళ్లకు టీ20 క్యాప్‌లు అందించగా.. భారత్ 121 మందితో రెండో స్థానంలో ఉంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్ జట్టును తీర్చిదిద్దే దిశగా భారత జట్టు అడుగులు వేస్తోంది.
యువ ఆటగాళ్లపై భారీ అంచనాలు:
దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్న సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్‌లపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఐర్లాండ్‌తో రెండో టీ20లో ఈ ఇద్దరూ తమ ప్రతిభను నిరూపించుకుని టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించేందుకు ప్రయత్నించనున్నారు.
యువ ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇస్తున్న భారత జట్టు భవిష్యత్ టీ20 ప్రణాళికల్లో వీరి పాత్ర కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.




