క్రికెట్ హిస్టరీలోనే చారిత్రత్మక మ్యాచ్ ఆడనున్న వైభవ్.. అంత స్పెషల్ ఏంటి, ఎప్పుడు, ఎక్కడ?

India vs Japan T20I: భారత క్రికెట్ జట్టు మరో అరుదైన అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. జపాన్‌తో తొలిసారి ప్రత్యేక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్ తలపడనుంది.

Venkat
Updated on: 4 Sept 2026 6:16 PM IST
India vs Japan T20I
X

క్రికెట్ హిస్టరీలోనే చారిత్రత్మక మ్యాచ్ ఆడనున్న వైభవ్.. అంత స్పెషల్ ఏంటి, ఎప్పుడు, ఎక్కడ?

India vs Japan T20I: భారత క్రికెట్ జట్టు మరో అరుదైన అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. జపాన్‌తో తొలిసారి ప్రత్యేక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. భారత్ – జపాన్ దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 22, 2026న జపాన్‌లోని తోచిగి ప్రిఫెక్చర్‌లో ఉన్న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. ఈ పోరుకు ‘సుజుకి కప్’ గా పేరు పెట్టారు. భారత్, జపాన్ పురుషుల జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి.

75 ఏళ్ల స్నేహానికి క్రికెట్ వేదిక..

భారత్–జపాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవ వేడుకలకు ఈ మ్యాచ్ శ్రీకారం చుట్టనుంది. ‘స్పోర్ట్ 75’ కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. రెండు దేశాల మధ్య క్రీడా సహకారాన్ని, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. జపాన్‌లో భారత్ ఆడబోయే ఈ ప్రత్యేక టీ20 మ్యాచ్ క్రికెట్‌ను తూర్పు ఆసియాలో మరింత విస్తరించేందుకు మంచి అవకాశమని పేర్కొన్నారు. జపాన్‌లో క్రికెట్ అభివృద్ధికి జపాన్ క్రికెట్ అసోసియేషన్‌తో కలిసి పనిచేస్తామని బీసీసీఐ వెల్లడించింది.

ఆసియా క్రీడలకు ముందు కీలక మ్యాచ్..

మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ మ్యాచ్ జరిగిన రెండు రోజులకే జపాన్‌లో 2026 ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. భారత్ కూడా ఈ క్రీడల్లో పాల్గొంటుంది. దీంతో జపాన్‌తో జరిగే టీ20 మ్యాచ్ ఆసియా క్రీడలకు ముందు భారత జట్టుకు సన్నాహక పోరుగా ఉపయోగపడే అవకాశం ఉంది.

క్రెక్స్ కథనం ప్రకారం, శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టులోని పలువురు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో కనిపించే అవకాశం ఉందని అంచనా. అయితే భారత్ తుది జట్టును బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

జపాన్ క్రికెట్‌కు భారీ అవకాశం..

భారత్ వంటి అగ్రశ్రేణి క్రికెట్ జట్టుతో స్వదేశంలో మ్యాచ్ ఆడటం జపాన్ క్రికెట్‌కు ఎంతో కీలకమైన పరిణామం. జపాన్ క్రికెట్ అసోసియేషన్ కూడా భారత ప్రపంచ ఛాంపియన్ జట్టును తమ దేశానికి ఆహ్వానించడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొంది. స్థానిక అభిమానుల్లో క్రికెట్‌పై ఆసక్తిని పెంచేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.




Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story