Cricket: 34 వేల సీట్లకు 83,97,294 రిక్వెస్టులు.. ఇండియా-పాక్ మ్యాచ్ టికెట్లకు ఫైనల్‌ను మించిన క్రేజ్!
Cricket: 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ మ్యాచ్‌కు 34 వేల సీట్లకు 83,97,294 టికెట్ రిక్వెస్టులు వచ్చినట్టు తెలుస్తోంది.
Cricket: 34 వేల సీట్లకు 83,97,294 రిక్వెస్టులు.. ఇండియా-పాక్ మ్యాచ్ టికెట్లకు ఫైనల్‌ను మించిన క్రేజ్!
Cricket: 2027 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు భారీ డిమాండ్ నెలకొంది. టికెట్ల కోసం ఏకంగా 83,97,294 రిక్వెస్టులు వచ్చాయి. కానీ జొహెన్నెస్‌బర్గ్‌లోని స్టేడియం సీటింగ్ కెపాసిటీ కేవలం 34 వేలు. అక్టోబర్ 10న ఈ మ్యాచ్ జరగనుంది. త్వరలోనే ఈ రిక్వెస్టుల సంఖ్య కోటి దాటే అవకాశం ఉంది. ఫైనల్‌కు 79L రిక్వెస్టులే వచ్చాయట. ఇండియా, పాక్ మ్యాచ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి. ఏమంటారు?
ఈ మ్యాచ్ జొహెన్నెస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో గ్రూప్ స్టేజ్‌లో జరగనుంది. నవంబర్ 21న జరిగే ఫైనల్ కూడా ఇదే స్టేడియంలో జరుగుతుంది. ఫైనల్‌కు 79,00,944 రిక్వెస్టులు వచ్చాయని ICC వెల్లడించింది.
టోర్నీ మొత్తానికి ICCకి 12 కోట్లకు పైగా టికెట్ రిక్వెస్టులు వచ్చాయి. 193 దేశాల నుంచి 28 లక్షల మంది అభిమానులు దరఖాస్తు చేశారు. ఈ వరల్డ్ కప్‌ను సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికాలో జరుగుతున్న ఈ టోర్నీకి టికెట్ బ్యాలెట్ నవంబర్ 21, 2026 వరకు కొనసాగుతుంది.




