India Squad: టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు ఇదే.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
India Squad: మహిళల టీ20 ప్రపంచకప్ 2025 కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది.
India Squad: టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు ఇదే.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
India Squad: మహిళల టీ20 ప్రపంచకప్ 2025 కోసం భారత మహిళల జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం అధికారికంగా ప్రకటించింది. అమితా శర్మ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులకు జట్టులో చోటిచ్చారు. అంచనాల ప్రకారమే హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కాగా.. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుంది. జట్టులో పలువురు స్టార్ ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. గాయాల కారణంగా కొంతమంది దూరమయ్యారు. టీ20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ వేదికగా జూన్ 12 నుంచి ఆరంభం కానుంది.
భారత జట్టులో షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రేణుకాసింగ్ ఠాకూర్ వంటి కీలక ప్లేయర్స్ చోటు సంపాదించారు. అయితే గాయం కారణంగా అమన్‌జోత్ కౌర్ జట్టుకు దూరమవ్వడం పెద్ద షాక్ అనే చెప్పాలి. ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా వంటి ఆటగాళ్లు కూడా జట్టులో స్థానం కోల్పోయారు. హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. అమంజోత్ కౌర్ స్థానంలో భారతి ఫుల్‌మాలిను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో అగ్రెసివ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడం ఈ ఎంపికకు కారణం. 10 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్లలో ఒకరిగా నిలిచిన నందనీ శర్మకు కూడా భారత జట్టులో అవకాశం దక్కింది.
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో భారత జట్టు స్పిన్ దళాన్ని శ్రేయంకా పాటిల్, రాధా యాదవ్, శ్రీ చరణి ముందుండి నడిపించనున్నారు. వీరు స్నేహ్ రాణా, వైష్ణవి శర్మల కంటే అద్భుత ప్రదర్శన చేసి జట్టులో స్థానం సంపాదించారు. రాధా యాదవ్ ఆల్‌రౌండర్‌గా కూడా జట్టుకు ఉపయోగపడుతుందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అభిప్రాయపడింది. ఈసారి స్టాండ్‌బై ప్లేయర్లను ప్రకటించకపోవడం విశేషం. ఇక ఈరోజు జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, హెడ్ కోచ్ అమోల్ మజుందార్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ పాల్గొన్నారు. ఆపై జట్టును ప్రకటించారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఎలో ఉన్న భారత్ లీగ్ దశలో తొలి మ్యాచ్‌ను జూన్ 14న పాకిస్థాన్‌తో ఆడనుంది. 17న నెదర్లాండ్స్, 21న దక్షిణాఫ్రికా, 25న బంగ్లాదేశ్, 28న ఆస్ట్రేలియాను భారత్ ఢీకొట్టనుంది. మరోవైపు గ్రూప్-బిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, శ్రీలంక, ఐర్లాండ్ ఉన్నాయి. జూన్ 30న తొలి సెమీస్, జులై 2న రెండో సెమీస్ జరుగుతాయి. ఇక జులై 5న లార్డ్స్ మైదానంలో ఫైనల్ జరగనుంది.
భారత్ మహిళల జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతి ఫుల్‌మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), శ్రీ చరణి, యష్టిక భాటియా (వికెట్ కీపర్), నందనీ శర్మ, అరుంధతి రెడ్డి, రెణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయంకా పాటిల్, రాధా యాదవ్.




